బాబు ఆడకాదు..మగ కాదు

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడ కాదు..మగ కాదని, ఆయన ఫోర్త్‌ జెండర్‌కు చెందిన వ్యక్తి అని వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో ప్రత్యేక హోదా వద్దు..ప్యాకేజీ కావాలని స్వాగతించారని గుర్తు చేశారు. ఇవాళ మళ్లీ చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని డిమాండు చేయడం ఆయన చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోందన్నారు. గతంలో చంద్రబాబు సొంత మామ ఎన్‌టీ రామారావును వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఇవాళ ఆంధ్రరాష్ట్రాన్నే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఇంతవరకు ఫస్ట్‌ జెండర్, సెకండ్‌ జెండర్, థర్డ్‌ జెండర్‌ మాత్రమే చూశామని, చంద్రబాబు ఫోర్త్‌ జెండర్‌ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆడ కాదు..మగ కాదని ఫోర్త్‌ జెండర్‌కు చెందిన వ్యక్తి అని విమర్శించారు. ప్రకృతి కార్యములో కూడా డ్యూయల్‌ రోల్‌ ప్లే చేసే వారే ఫోర్త్‌ జెండర్‌ అని వివరించారు. అటువంటి వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ..రాష్ట్రాన్ని దోచేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ దోచుకున్న సొమ్మును చంద్రబాబు విదేశాలకు తరలిస్తున్నా మనందరం ప్రేక్షకపాత్ర పోషించాల్సి వస్తుందన్నారు. చంద్రబాబుకు కేంద్రంలో మంచి పలుకుబడి ఉండబట్టే  ఇలా చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఫోర్త్‌ జెండర్‌ నుంచి ట్రాన్స్‌జెండర్‌గా కూడా మారగలరని విమర్శించారు. ఊసరవెళ్లిలా మార్పులు చేసుకోగలిగిన వ్యక్తి చంద్రబాబు అని అభివర్ణించారు. ఒకవైపు బీజేపీతోనూ, మరోవైపు కాంగ్రెస్‌తోనూ అన్నింటితో కూడా సంబంధాలు కొనసాగిస్తున్న, చీకటి ఒప్పందాలు చేసుకున్న వ్యక్తి చంద్రబాబు ఒక్కరే అన్నారు. ఇటువంటి వ్యక్తిని ఎప్పుడు ఓడిస్తామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
 
–గతంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందన్నారు. ఆ రోజు చంద్రబాబు అవిశ్వాస తీర్మానం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారన్నారు. ఆ తరువాత యూటర్న్‌ అంకుల్‌ మళ్లీ మాట మార్చారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌సీపీ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటుందన్నారు. బీజేపీ చేసిన అన్యాయాన్ని తిరిగి న్యాయం చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినా వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మద్దతిస్తుందన్నారు. తెలుగు దొంగల పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.  
Back to Top