ఎంపీ దీక్ష‌కు ఎమ్మెల్యేల సంఘీభావం

నెల్లూరుః

 దుగ్గ‌రాజ‌ప‌ట్నం పోర్టు కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వ‌ర‌ప్ర‌సాద‌రావు చేప‌ట్టిన ఒక్క రోజు నిరాహార‌దీక్ష‌కు ఎమ్మెల్యేలు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాద‌వ్‌, సంజీవ‌య్య‌లు సంఘీభావం తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ..ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌ని చంద్ర‌బాబు ఏ మొహం పెట్టుకొని ఇంటింటికీ కార్య‌క్ర‌మం చేప‌ట్టార‌ని ప్ర‌శ్నించారు.  చంద్ర‌బాబు చేప‌ట్టిన ఇంటింటికీ కార్య‌క్ర‌మ‌లో పాల్గొనేందుకు టీడీపీ నేత‌లే జంకుతున్నార‌ని ఎద్దేవా చేశారు. దుగ్గ‌రాజుప‌ట్నం విష‌యంలో ప్ర‌భుత్వం స్పందించాల‌ని కోరారు.

తాజా ఫోటోలు

Back to Top