చంద్ర‌బాబు అసమ‌ర్థ ముఖ్యమంత్రి


 
విశాఖపట్నం :  చంద్ర‌బాబు అస‌మ‌ర్ధ‌త ముఖ్య‌మంత్రి అని,  విపరీతంగా అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయ‌న‌దే అని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు.విశాఖ దీక్ష‌లో ఆయ‌న మాట్లాడుతూ.. 29 సార్లు ఢిల్లీ వెళ్లి వట్టిచేతులతో తిరిగివచ్చిన ముఖ్యమంత్రి కూడా ఆయనేనని ఎద్దేవా చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉండి ప్రత్యేక హోదా, విభజన హామీలు  అమలు చేయించలేని అమసర్థ ముఖ్యమంత్రి చంద్రబాబేనంటూ నిప్పులు చెరిగారు. ‘ప్రత్యేక హోదా తేలేకపోవడం వల్ల గత నాలుగు సంవత్సరాల్లో లక్షాముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పులుపాలు కావాల్సి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చాక గత 60-70 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రం కోసం కేవలం 90 వేల కోట్ల రూపాయల అప్పు తెస్తే.. ఇప్పుడు కేవలం నాలుగేళ్లలో ఏపీని అప్పుల పాలు చేశారు’ అని ఆయన మండిపడ్డారు.  పదిరోజుల క్రితం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ఎందుకు చేశారో ఎవరికి తెలియదని ఎద్దేవా చేశారు. అన్ని హామీలు ఇచ్చి నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబేనని, ప్రజలను ఆయన ఏ విధంగా మోసం చేస్తున్నారో అందరూ తెలుసుకోవాలని అన్నారు. Back to Top