పంచపాండవుల్లా రాజీనామాలు చేస్తాం

హోదా కోసం మొదటి నుంచి వైయస్‌ఆర్‌సీపీ పోరాటం
హోదా ఇచ్చేందుకు బీజేపీ ఎందుకు వెనకడుగు వేస్తుంది
దుగ్గరాజపట్నం పోర్టు బాబే అడ్డుకుంటున్నాడు
పోలవరం నిధులపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి
ఢిల్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంపై పెట్టే అవిశ్వాస తీర్మానానికి ఎవరూ మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. పంచ పాండవుల్లా ఎంపీలమంతా రాజీనామాలు చేస్తామని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. ప్రత్యేక హోదా కోసం వెనకడుగు వేయకుండా పోరాడుతున్న పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ ఒక్కేనన్నారు. పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీ వరప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హోదాపై ప్రజలందరిలో చైతన్యం తీసుకువచ్చారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ పోరాటాలకు భయపడి తెలుగుదేశం పార్టీ కూడా వెనకాల వస్తుందన్నారు. త్వరలో కేంద్రం కూడా దిగివచ్చేలా పోరాటాలు చేస్తామని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు. 
చిన్నపిల్లలకు చెప్పినట్లుగా కేంద్రం కబుర్లు
ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తుందని ఎంపీ వరప్రసాద్‌ ప్రశ్నించారు. హోదా భిక్ష కాదు.. ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అని ధ్వజమెత్తారు. చిన్న పిల్లలకు చెప్పినట్లుగా 14వ ఆర్థిక సంఘం, నీతి అయోగ్‌ అని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్నాళ్లు కబుర్లు చెప్పాయని మండిపడ్డారు. హోదా కోసం ముందుండి పోరాడాల్సిన చంద్రబాబు నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను హేళన చేసిన మాట్లాడాడన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అవిశ్వాస తీర్మానం పెడతాం మా వెనక రండీ అని.. లేదా మీరు పెడితే.. మీకు మద్దతు ఇస్తామని వైయస్‌ జగన్‌ చెప్పడం జరిగిందన్నారు. 
నిధుల గురించి ప్రజలకు తెలియాలి
దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి ఎలాంటి కారణాలు లేకున్నా చంద్రబాబే అడ్డుకుంటున్నాడని ఎంపీ వరప్రసాద్‌ విమర్శించారు. ఓ ప్రైవేట్‌ పోర్టును కాపాడేందుకు ప్రభుత్వ పోర్టును నిర్లక్ష్యం చేస్తున్నాడని మండిపడ్డారు. అదే విధంగా ప్రత్యేక రైల్వేజోన్‌కు విశాఖపట్నం అనువైన ప్రదేశమన్నారు. పోలవరంపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు పోలవరం నిర్మాణానికి వచ్చాయో ప్రజలందరికీ తెలియజేయాలని కోరారు. 
 
Back to Top