బాబుకు భయం పట్టుకుంది

ఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో వైయస్‌ఆర్‌సీపీ దూసుకుపోతుందని గ్రహించిన చంద్రబాబుకు భయం పట్టుకుందని, అందుకే ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ మాటలు మార్చుతున్నారని ఎంపీ వర ప్రసాద్‌ అన్నారు. చంద్రబాబు ఊసరవెళ్లిలాగా రంగులు మార్చడం బాగా అలవాటైందని, నాలుగేళ్లు ప్రత్యేక హోదాతో ఏం ప్రయోజనమని ప్రశ్నించిన వ్యక్తి మాట మార్చారన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారు..వైయస్‌ఆర్‌సీపీ ప్రత్యేక హోదా కోసం ఒక పద్ధతి ప్రకారం ఆందోళనలు చేపట్టామన్నారు. మా నాయకులు వైయస్‌ జగన్‌ అలుపెరగని పోరాటం చేశారన్నారు. మా పోరాటం వల్లే ప్రజల్లో చైతన్యం వచ్చిందని, వైయస్‌ఆర్‌సీపీకి ఎక్కడ క్రెడిట్‌ వస్తుందోనని మా వెనుక వచ్చేందుకు చంద్రబాబు అడుగులు వేశారన్నారు. నిన్నటి వరకు ఎన్‌డీఏ నుంచి వైదొలగని చంద్రబాబు, ఈ రోజు మేం అవిశ్వాస తీర్మానం పెట్టడంతో వేరే మార్గం లేదని గ్రహించిన చంద్రబాబు 24 గంటల్లో రంగులు మార్చి, మాటలు మార్చారన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామన్న చంద్రబాబు మళ్లీ మాట మార్చి ఇవాళ ఎన్‌డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు డ్రామాలాడుతున్నారన్నారు. టీడీపీ నేతలు తలో మాట మాట్లాడుతన్నారని విమర్శించారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రత్యేక హోదాపై దూసుకుపోతుందన్నారు. చంద్రబాబుకు భయం పట్టుకుందని తెలిపారు.
 
Back to Top