కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది


ఢిల్లీ: రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించారని, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తున్న బీజేపీకి అదే గతి పడుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక హోదా కోరుతున్నారన్నారు. ప్రజల ఆకాంక్షను తెలిపేందుకే నిన్న జాతీయ రహదారుల దిగ్బంధాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదాపై కనీసం చర్చకైనా అనుమతించాల్సి ఉందన్నారు. ఇవాళ చర్చకు అనుమతించకుండా ఎన్‌డీఏ తప్పు చేసిందన్నారు. నాడు రాష్ట్రాన్ని విభజించి యూపీఏ ప్రభుత్వం అన్యాయం చేస్తే ఇవాళ ఎన్‌డీఏ ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. ఈ రోజు వైయస్‌ఆర్‌సీపీ వల్ల ప్రత్యేక హోదాకు ఊపిరి పోయడంతో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని గ్రహించిన చంద్రబాబు ఇవాళ యూటర్న్‌ తీసుకున్నారన్నారు. ప్యాకేజీ ప్రకటించిన సమయంలో చంద్రబాబు కేంద్రాన్ని ఎంత ఇస్తున్నారో అని ప్రశ్నించి ఉంటే ఇప్పుడు అన్యాయం జరిగేది కాదన్నారు. మా కార్యాచరణ ప్రకారం అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించకపోతే రంగులు మార్చేది లేదని, ముందు చెప్పినట్లు రాజీనామాలకు సిద్ధమన్నారు. మాలో ఏ లోపం లేదన్నారు. టీడీపీ చిత్తశుద్ధితో అడకపోవడం వల్లే ప్రత్యేక హోదా రాలేదన్నారు. ప్రతి ఆంధ్రుడు హోదా కోరుతున్నారని, ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇ వ్వాలని ఆయన కోరారు. 
Back to Top