రాత్రికి రాత్రే రంగులు మార్చిన చంద్రబాబు

ఢిల్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కడ పేరొస్తుందోనని భయపడి చంద్రబాబు రాత్రికి రాత్రే రంగులు మార్చాడని పార్టీ ఎంపీ వరప్రసాద్‌ మండిపడ్డారు. నిన్నటి వరకు వైయస్‌ఆర్‌ సీపీ అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నానని చెప్పి.. రంగులు మార్చి లేదు వేరుగా వెళ్తున్నామంటూ ప్రకటించాడన్నారు. ఢిల్లీలో పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీ వరప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీకి భయపడి తెలుగుదేశం పార్టీ వస్తుందని, అంతేగానీ వారికి ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు స్పీకర్‌కు వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోటీసులు ఇచ్చారని, అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు ఇవ్వమని కోరడం జరిగిందన్నారు. ప్రత్యేక హోదాకు ప్రాణం పోసింది వైయస్‌ఆర్‌ సీపీ అని, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ చేసిన ఉద్యమాలతోనే ఉద్యమం ఉధృతమైందన్నారు. ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు పడుతుందనే భయంతో చంద్రబాబు ఎన్డీయే నుంచి భయటకు వచ్చారన్నారు. అవిశ్వాసానికి ముందుకు రాకపోతే వైయస్‌ఆర్‌ సీపీ విప్‌ జారీ చేస్తుందని, అప్పుడు ఎంపీలపై వేటు పడుతుందని ముందుకు వచ్చిందన్నారు. 
 
Back to Top