రాజీనామాల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాంఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు ఈ నెల 6వ తేదీన ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌ తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇస్తామన్న హామీని నీరుగార్చారని మండిపడ్డారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా నాలుగేళ్లుగా వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. చివరి అస్త్రంగా ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నామని ఆయన ప్రకటించారు. అనంతరం ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని ఎంపీ తేల్చి చెప్పారు. 
 
Back to Top