బాబు దీక్ష ‘కొంగ జపం’

నాలుగేళ్లు దోస్తీ చేసి కేంద్రంపై దీక్ష చేయడం హాస్యాస్పదం
జన్మభూమి కమిటీలు, ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం అపహాస్యం
కలెక్టర్‌ వ్యవస్థను సైతం నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు
ప్రజాస్వామ్య వ్యతిరేకులు దీక్ష చేస్తే దాని అర్థం మారిపోతుంది
మరోసారి ప్రజలను మభ్యపెట్టే పన్నాగం
చంద్రబాబు, మోడీ ఇద్దరూ తోడుదొంగలు
విజయవాడ: ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి.. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను కాలరాసి.. చంద్రబాబు చేస్తున్న దీక్ష కొంగజపం లాంటిదని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వరప్రసాద్‌ విమర్శించారు. నాలుగేళ్లుగా కేంద్రంతో సక్యతగా ఉంటూ.. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా దీక్ష చేపడుతున్నానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. మోడీ గ్రాఫ్‌ పడిపోతుందని భావించిన చంద్రబాబు మళ్లీ కొత్త చక్రాలను వెతుక్కుంటూ.. బయటకు వచ్చి ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టేందుకు దీక్ష చేపడుతుందన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వరప్రసాద్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీక్ష ప్రజాస్వామ్య ఆయుధమని, కానీ చంద్రబాబు లాంటి ప్రజాస్వామ్య వ్యతిరేకులు దీక్ష చేపడితే.. దాని అర్థం మారిపోతుందన్నారు. 
ప్రజాస్వామ్యాన్ని కించపరిచారు..
ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ముగ్గురు మంత్రులను చంద్రబాబు సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని వరప్రసాద్‌ విరుచుకుపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన చంద్రబాబు ప్రజాస్వామ్యంపై ఎంత గౌరవం ఉందో సమాధానం చెప్పాలన్నారు. అదే విధంగా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులకు, కలెక్టర్‌లకు సైతం అధికారాలు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా కలెక్టర్‌ వద్దకు కొంత మంది ప్రజలు న్యాయమైన సమస్యను పరిష్కరించాలని వారిని పంపిస్తే అర్హత ఉన్నా.. పెన్షన్‌ ఇవ్వలేదని, అదేమని అడిగితే.. పెన్షన్‌ ఇచ్చే అధికారం జన్మభూమి కమిటీలకు ఉందని స్వతహాగా కలెక్టర్‌ చెప్పారన్నారు. చంద్రబాబు టీడీపీ కార్యాలయాలకు, కలెక్టరేట్‌లకు తేడా లేకుండా చేశాడని మండిపడ్డారు. 
హోదా వచ్చుంటే.. రాష్ట్రం అప్పులపాలయ్యేదా..?
గత నాలుగేళ్లుగా వివిధ రకాల ఉద్యమాలు, దీక్షలు, యువభేరీలు నిర్వహించి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రజలకు వివరించారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ పోరాటాల వల్లే ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు. మొదటి నుంచి ప్యాకేజీని పట్టుకొని వేలాడుతున్న చంద్రబాబు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో హోదా అంటూ కూనిరాగం పాడుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అర్ధరాత్రి అంగీకరించిన ప్రత్యేక ప్యాకేజీలో ఏముందో చెప్పలేదు.. ప్రత్యేక హోదా కావాలని ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడలేదు.. అలాంటి వ్యక్తి దీక్ష చేస్తే దానికి ప్రాముఖ్యత ఎలా ఉంటుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ. 90 వేల కోట్ల అప్పు ఉంటే.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చంద్రబాబు రూ. 1.20 లక్షల అప్పు చేశాడన్నారు. హోదా వచ్చి ఉంటే.. రాష్ట్రం అప్పులపాలయ్యేదా చంద్రబాబూ అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో మళ్లీ ఏ విధంగా మోసం చేయాలనే ఆలోచన తప్ప మరేదీ లేదన్నారు. 
మోసం చేయడంలో బాబుకు అనుభవం..
మోడీ, చంద్రబాబు ఇద్దరు తోడుదొంగలు కలిసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మోసం చేశారని వరప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు 600ల హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విరుచుకుపడ్డారు. తిరుపతిలో చంద్రబాబు, మోడీ ఇద్దరు కలిసి 10 ఏళ్లు అంటే.. 15 ఏళ్లు హోదా అంటూ పోడీ పడి ప్రజలను వంచించారన్నారు. అదే విధంగా పోలవరం విషయంలో కూడా మోసం చేశారన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ, ప్రతి ఒక్కరికి స్మార్ట్‌ ఫోన్‌లు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని అన్ని విధాలుగా మోసం చేశాడన్నారు. అంతే కాకుండా కులాల మధ్య చిచ్చు పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అంతేకాకుండా దళితులు, బలహీనవర్గాలను కించపరిచి మాట్లాడిన వ్యక్తికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. దేశంలోనే నా అంత సీనియర్‌ నేత లేడు.. కేంద్రం నన్ను చూసి వణుకుతుందని చెప్పుకునే చంద్రబాబు విభజన చట్టంలోని అంశాలను సాధించలేని అసమర్థుడన్నారు. చంద్రబాబుకు అబద్ధం చెప్పడం, మోసం చేయడంలో అనుభవం ఉందన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేస్తానని ఒక్క అబద్ధం చెప్పి ఉంటే.. ముఖ్యమంత్రి అయ్యుండేవారని, కానీ వైయస్‌ జగన్‌కు అబద్ధాలు చెప్పే అలవాటు లేదన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయిన ప్రజలంతా ఇప్పుడు వైయస్‌ జగన్‌ వంక చూస్తున్నారన్నారు. 
 
Back to Top