దుగ్గ‌రాజ‌పాట్నం పోర్టు కోసం దీక్ష‌

దుగ్గ‌రాజప‌ట్నం పోర్టు సాధ‌న‌కు ప్ర‌జ‌లంతా భాగ‌స్వాములు కావాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుప‌తి ఎంపీ వెల‌గ‌ప‌ల్లి వ‌ర‌ప్ర‌సాద‌రావు అన్నారు. దుగ్గ‌రాజప‌ట్నం పోర్టు కోసం గూడురు నియోజ‌క‌వ‌ర్గం వాకాడు మండ‌లం దుగ్గ‌రాజ‌ప‌ట్నం గ్రామంలో ఒక్క నిరాహార‌దీక్ష చేప‌ట్టారు. రాష్ట్ర ప్ర‌భుత్వం మెడ‌లు వంచేందుకు ఎన్ని దీక్ష‌లు అయినా చేసేందుకు సిద్ధ‌మ‌ని ఎంపీ అన్నారు. ఎంపీ వ‌ర‌ప్ర‌సాద‌రావు నిరాహార‌దీక్ష‌కు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చి సంఘీభావం తెలిపారు. కార్య‌క్ర‌మంలో గూడురు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త మేరిగ ముర‌ళీధ‌ర్‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top