సీబీఐ విచారణ తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ ప్రయత్నం

హైదరాబాద్‌: టీడీపీకి చెందిన అశోక్‌గజపతిరాజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఎయిర్‌ ఏషియా కుంభకోణంపై జరుగుతున్న సీబీఐ విచారణను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్‌ 6న మేం ప్రత్యేక హోదా సాధనకు ఎంపీ పదవులకు ఐదుగురం రాజీనామా చేశామన్నారు. 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబుకు చెప్పినా కూడా ఆయన పారిపోయారన్నారు. అవిశ్వాస తీర్మానం వల్ల ఒరిగేది ఏమీ లేదని చంద్రబాబు హేళనగా మాట్లాడారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీని కూడా కలుపుకుపోతామని చెప్పినా కూడా వినలేదన్నారు.  
 
Back to Top