వైయస్‌ జగన్‌ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది


అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా ఈ నెల 14, 15వ తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతపురంలో శుక్రవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మిథున్‌రెడ్డి మాట్లాడారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను దగా చేశారని మండిపడ్డారు. రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఘనత బాబుదే అన్నారు. చంద్రబాబు వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలను విజయవంతం చేయాలని మిథున్‌రెడ్డి పిలుపునిచ్చారు.
 
Back to Top