ఢిల్లీ: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సోమవారం కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌ను కలిశారు. ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థుల సమస్యలపై జోక్యం చేసుకోవాలని ఎంపీ మిథున్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి విద్యార్థులను ఏదో ఒక కాలేజీలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.