సోషల్‌ మీడియాను ఆయుధంగా చేసుకోండి


బెంగళూరు: సోషల్‌ మీడియాను ఆయుధంగా చేసుకొని టీడీపీ ప్రభుత్వ అవినీతి పాలనను, వైఫల్యాలను ఎండగట్టాలని ఎంపీ మిథున్‌రెడ్డి వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బెంగుళూరులో నిర్వహించిన వైయస్‌ఆర్‌ కుటుంబం ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఆయన మాట్లాడుతూ..ఏపీలో అవినీతి పాలన సాగుతోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమని, ప్రతి ఒక్కరూ వైయస్‌ఆర్‌సీపీకి ఓటు వేసి వైయస్‌ జగన్‌ను సీఎం చేయాలని కోరారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 
 
Back to Top