మాది సెక్యులర్‌ పార్టీ

ఢిల్లీ:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్యుల‌ర్ పార్టీ అని సీనియ‌ర్ నాయ‌కులు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రప‌తితో భేటీ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌పై, వైయస్‌ఆర్‌సీపీపై చంద్రబాబు నెపం నెట్టి బురద జల్లుతున్నారన్నారు. మాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మాది సెక్యూలర్‌ పార్టీ అని చెప్పారు. మోడీ ప్రధాని అభ్యర్ధి తిరుపతి సభలో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. బీజేపీ భాగస్వామి అయిన చంద్రబాబుపై కూడా ఉందన్నారు. విభజన సమయంలో ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ తదితర హామీలను నెరవేర్చేలే జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరినట్లు మేకపాటి తెలిపారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇక ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి అద్భుతమైన రాజధాని నిర్మించి ఇస్తామని  తిరుపతి బహిరంగ సభలో నరేంద్రమోదీ మాట ఇచ్చారన్నారు. ఈ హామీని ప్రధాని విస్మరించి, ఘోర తప్పిందం చేశారన్నారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, ఎప్పటికైనా సాధించుకుంటామని ఎంపీ మేకపాటి అన్నారు. ఇప్పటికైనా విభజన హామీలు అమలు చేయమని కోరుతున్నామమన్నారు. రాజ్యాంగపరంగా తాను ఏం చేయగలనో అవి చేస్తామని రాష్ట్రపతి కోవింద్‌ హామీ ఇచ్చారని మేకపాటి తెలిపారు.   
Back to Top