పచ్చ మీడియాతో బాబు తప్పుడు ప్రచారం

నెల్లూరు: ప్రత్యేక హోదా కోసం తానే ముందుండి పోరాడుతున్నట్లుగా చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు పూటకో మాట.. రోజుకో నిర్ణయం తీసుకుంటున్నాడని మండిపడ్డారు. నెల్లూరులో మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ సాధించామని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని చెబుతున్నారన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు మరో ఎత్తుగడకు దిగారన్నారు. చంద్రబాబు నిరంకుశ వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన రీతిలో గుణపాఠం చెబుతారన్నారు. 
Back to Top