చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలు

ఢిల్లీ: చంద్రబాబువి అవకాశావాద రాజకీయాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తృణముల్‌ కాంగ్రెస్, కాంగ్రెస్‌పార్టీ, శివసేన, తదితర పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. ఇప్పటికైనా సరే అవిశ్వాస తీర్మానంపై ప్రతి రోజు కూడా నోటీసులు ఇస్తామన్నారు. సోమవారం కూడా నోటీసులు ఇస్తామని చెప్పారు. ఇవాళ సభ ఆర్డర్‌లో లేదని స్పీకర్‌ వాయిదా వేశారన్నారు. వైయస్‌ జగన్‌ మొదటి నుంచి ప్రత్యేక హోదా, విభజన అంశాల సాధనకు పోరాటం చేస్తుందన్నారు. బీజేపీ, టీడీపీలు నాలుగేళ్లు కలిసి అధికారం అనుభవించారన్నారు. ఇప్పుడు టీడీపీ కూడా అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారన్నారు. చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలని విమర్శించారు. ప్రత్యేక హోదా సంజీవినా అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు హోదా కోసం పోరాటం చేస్తామని చెబితే ఎవరూ నమ్మరన్నారు. వైయస్‌ జగన్‌ యువబేరిలు నిర్వహిస్తే విద్యార్థులపై కేసులు పెడతామని చంద్రబాబు హెచ్చరించారని గుర్తు చేశారు. ఐదు కోట్ల మంది ప్రజలు ప్రత్యేక హోదా కోసం నినదిస్తుంటే ఇప్పుడు చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. అందుకోసమే ఇవాళ ఎన్‌డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారన్నారు. కొంప మునిగిపోతుందని భావించి చంద్రబాబు బీజేపీ నుంచి విడిపోయారని విమర్శించారు. ఇవాళ కొన్న చానల్స్‌ వైయస్‌ఆర్‌సీపీ ఏమీ చేయనట్లు, చంద్రబాబే అన్ని చేస్తున్నట్లు గ్లోబల్‌ ప్రచారం చేయడం సరికాదన్నారు. చానల్స్‌ క్రెడిబులిటి ఏమవుతుందని, అసత్యాలు ప్రచారం చేసి క్రెడిబులిటీ పోగొట్టుకోవద్దని హితవు పలికారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఫర్వాలేదని వైయస్‌ జగన్‌ ప్రజల పక్షాన నిలబడ్డారన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
 
Back to Top