ప్రత్యేక హోదా సాధనకు కేంద్రాన్ని నిలదీస్తాం

వైయస్‌ జగన్‌ ఆదేశాలతో ఢిల్లీలో వైయస్‌ఆర్‌ సీపీ ధర్నా
హోదా సాధించేదాకా ఉద్యమం ఆగదు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్యాయాలను ఎండగడతాం
ఫిరాయింపుదారులతో రాజీనామా చేయిస్తేనే అసెంబ్లీకి
అసెంబ్లీ సమావేశాలకు వైయస్‌ఆర్‌ సీపీ దూరం
రాజ్యసభ ఎన్నికలపై కుయుక్తులు పన్నితే చంద్రబాబు కొంప కొల్లేరే
తాళ్లూరు: వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. ప్యాకేజీ మాకొద్దు అనే నినాదంతో ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. దర్శి నియోజకవర్గా తాళ్లూరులో వైయస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసిన అనంతరం మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విభజన సమయంలో చెప్పిన అన్ని అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని గట్టిగా నినదించనున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హోదా విషయంపై అనేక మాటలు మార్చారన్నారు. ఏపీకి అన్యాయం చేసిన వ్యక్తుల్లో ప్రథముడు చంద్రబాబేనన్నారు. ఆయన రాజకీయ స్వార్థం కోసం ప్రత్యేక హోదాను కాలరాశాడని మండిపడ్డారు. అదే విధంగా పోలవరం, విశాఖ రైల్వేజోన్, దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌ను తాకట్టుపెట్టారు. ఆంధ్రల హక్కును కేంద్రానికి గుర్తు చేసేందుకు ఢిల్లీలో పెద్ద ఎత్తున 5వ తేదీన జంతర్‌ మంతర్‌ వేదికగా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనున్నామన్నారు. ధర్నా అనంతరం వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలంతా పార్లమెంట్‌లో అన్ని విధాలుగా పోరాటం చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్రం చేసిన అన్యాయాన్ని ఎండగడతాన్నారు. 21వ తేదీన కేంద్రంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టనున్నామన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన ప్రతిపక్షంగా అన్ని విధాలుగా పోరాడి హోదాను సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. 
అసెంబ్లీ సమావేశాలు బైకాట్‌..
23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలతో రాజీనామా చేయించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తుందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. వాళ్లు రాజీనామా చేసేంత వరకు అసెంబ్లీ సమావేశాలను బైకాట్‌ చేస్తున్నామన్నారు. గతంలో జరిగిన సమావేశాలకు కూడా ఫిరాయింపు దారులను రాజీనామా చేయించాలని బైకాట్‌ చేయడం జరిగిందన్నారు. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు మరేమన్న కుట్రలు చేసి ఎమ్మెల్యేలను కొనాలని చూస్తే ఆయన కొంపే కొల్లేరు అవుతుందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీలో ఉన్న 44 మంది ఎమ్మెల్యేలు పార్టీ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నారని, చంద్రబాబు ఎన్ని నీతులు పలికినా ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. 
 
Back to Top