అవిశ్వాస తీర్మానానికి నోటీసు


ఢిల్లీ:  ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ దూకుడు పెంచింది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోటీసు ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఆయన నోటీసులు అందజేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని ఆయన నోటీసులో పేర్కొన్నారు. సభలో అవిశ్వాసాన్ని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొవాలని ఆయన కోరారు.
 
Back to Top