ప్లీనరీకి మోటారు సైకిల్‌ ర్యాలీ

అల్లవరం: అమలాపురంలో జరిగిన వైయస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశానికి మండల అధ్యక్షుడు కొనుకు బాపూజీ ఆధ్వర్యంలో సోమవారం భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలు నుండి వచ్చిన కార్యకర్తలు గుడ్డివానిచింత వద్దకు చేరుకున్నారు. అనంతరం గుడ్డివానిచింత నుండి భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీగా బయలుదేరి కోడూరుపాడు సెంటర్‌లో ఉన్న స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహనికి పూలమాలు వేసి ఘనంగా నివాళలర్పించారు. పిదప క్షత్రియ కళ్యాణమండపంలో జరిగిన ప్లీనరీ సమావేశానికి భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి ఇజ్రాయిల్, జిల్లా కార్యదర్శి యిళ్ల శేషారావు, బీసీ సెల్‌ అధ్యక్షుడు యల్లమిల్లి బోస్, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కలగట ఏసుబాబు, యూత్‌ అధ్యక్షుడు దాసం శ్రీరామచంద్రమూర్తి, రైతు విభాగ అధ్యక్షుడు బొక్కా శ్రీను, మండల ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి నరసింహరావు, గ్రామకమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top