స్టీల్‌ ఫ్యాక్టరీతోనే జమ్మలమడుగు అభివృద్ధి

వైయస్‌ఆర్‌ జిల్లా: స్టీల్‌ ఫ్యాక్టరీ వస్తే జమ్మలమడుగు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. జమ్మలమడుగులో చేపట్టిన కడప ఉక్కు– ఆంధ్రుల హక్కు దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. స్టీల్‌ ఫ్యాక్టరీ వస్తే 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ ప్రాంతంలో వన్యప్రాణులు తిరుగుతున్నాయని చంద్రబాబు కథలు చెబుతున్నారన్నారు. లిక్కర్‌ మాఫియా, జూదం మాఫియాలో కూరుకుపోయిన ఇద్దరు టీడీపీ నేతలు పరిశ్రమ కోసం దీక్షలు చేయడాన్ని చూసి ప్రజలంతా నవ్వుతున్నారన్నారు. సీఎం రమేష్‌నాయుడు ఏడేళ్లుగా ఏనాడూ రాజ్యసభలో ఉక్కు ఫ్యాక్టరీ గుర్తించి మాట్లాడిన దాఖళాలు లేవన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని, ప్రజలను మభ్యపెట్టేందుకు దొంగ దీక్షలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 
Back to Top