నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని టీడీపీకి భ‌యం

గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు లక్షల టన్నుల అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారన్న ఆయన... ఈ విషయంలో టీడీపీ నేతలు అతి తెలివి ప్రదర్శిస్తూ కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమ‌వారం న‌ర‌స‌రావుపేట‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్‌ వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌ ప్రమేయం ఉందని ధ్వ‌జ‌మెత్తారు.  నాలుగున్నరేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. టీడీపీ నేతల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని విమ‌ర్శించారు. తమ నేతలను కాపాడుకునేందుకు టీడీపీ ప్రభుత్వం అనామకులపై కేసులు పెడుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యరపతినేని అక్రమ మైనింగ్‌ను సందర్శించేందుకు అనుమతినివ్వకపోవడం ద్వారా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఫైర్ అయ్యారు.ఇలాంటి చర్యలకు భయడేది లేదని భవిష్యత్తులో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  

Back to Top