రైతులను దగా చేసిన బాబు

శ్రీకాకుళం:  వైయ‌స్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్ మోహన్‌ రెడ్డికి అబద్ధాలు చెప్పడం అలవాటు లేదని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. శ్రీకాకుళంలో జరిగిన పార్టీ ప్లీనరీలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక‌ పరిస్థితి అనుకూలంగా లేదనే ఎన్నికల్లో రైతు రుణమాఫీపై తప్పుడు హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. కోటయ్య కమిటీ సిఫార్సులును కూడా అమలుచేయకుండా సీఎం చంద్రబాబు రైతులను దగా చేశారని ఆరోపించారు. కులాలవారీగా హామీ ఇచ్చి అమలు చేయకుండా నిలువునా మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబు హామీలే ఇప్పుడు ప్రభుత్వాన్ని పాము అయి కాటేస్తున్నాయన్నారు. ప్రజలకు మతి మరుపు ఎక్కువ అనే భ్రమలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాలను నేరమయం చేస్తున్నారని అన్నారు. ప్లీన‌రీ స‌మావేశంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డిశాంతి, తమ్మినేని సీతారాం, కోలగట్ల వీరభద్రస్వామి, ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, వరుదు కళ్యాణి తదితర నాయకులు ప్లీనరీకి హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top