ఆశయం.. లక్ష్యం నెరవేరుతోంది


జిల్లా, జిల్లాకు పెరుగుతున్న ఆదరణ
జననేతలను ప్రజలంతా అక్కున చేర్చుకుంటున్నారు
 ప్రజా సంకల్పయాత్రకు పెరిగిన ఆదరణ
12వ తేదీన తూర్పుగోదావరిలోకి జననేత
ఘన స్వాగతం పలికేందుకు జిల్లా వాసుల ఆత్రుత

పశ్చిమగోదావరి: ప్రజా సంకల్పయాత్ర ఆశయం.. లక్ష్యం చక్కగా నెరవేరుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. పాదయాత్ర ప్రారంభం నుంచి ఒక జిల్లాను మించి మరో జిల్లాలో అద్భుతమైన రీతిలో ప్రజాదరణ లభిస్తోందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా 183వ రోజు ప్రజా సంకల్పయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతపై ప్రజలందరినీ సమీకరించాలని ఆశయం నెరవేరుతుందన్నారు. అదే విధంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యం కూడా త్వరలో నెరవేరబోతుందన్నారు. 

తూర్పుగోదావరి జిల్లాకు ప్రవేశించనున్న వైయస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికేందుకు జిల్లా వాసులంతా ఆత్రుతతో ఉన్నారని పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. 12వ తేదీన ప్రజా సంకల్పయాత్ర జిల్లాలోకి ప్రవేశించినున్నట్లు చెప్పారు. గతంలో ప్రజాప్రస్థానం పేరుతో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్రకు జక్కంపూడి రామ్మోహన్‌ ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం పలికారని, అది ఇప్పటికీ ఒక మైలురాయిగా మిగిలిపోయిందన్నారు. అదేరీతిలో వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్రకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వైయస్‌ఆర్‌ పాదయాత్ర కంటే వైయస్‌ జగన్‌ సంకల్పయాత్రకు వెయ్యిరెట్లు ప్రజాదరణ ఎక్కువగా కనిపిస్తోందన్నారు. 

నాలుగేళ్లుగా చంద్రబాబు ఈవెంట్‌ మేనేజర్‌గానే పనిచేస్తున్నారని పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. ప్రతీ నెల ఏదో ఈవెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్పితే.. హామీలను నెరవేర్చాలనే చిత్తశుద్ధి కనిపించడం లేదన్నారు. ఈవెంట్లతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమన్నారు. ప్రజలు తెలివితక్కువవారు కాదని, త్వరలోనే గుణపాఠం చెబుతారన్నారు. చంద్రబాబు చేసిన రెండు ప్రధానమైన తప్పులు చేశారని, జన్మభూమి కమిటీలు, ఇసుక, మట్టి అమ్ముకోవడమన్నారు. జన్మభూమి కమిటీలను ప్రవేశపెట్టి లోకల్‌ బాడీస్‌లను నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. 
Back to Top