చంద్రబాబు జీవితమే నాటకాలమయం

విజయనగరం: చంద్రబాబు జీవితం అంతా నాటకాలమయమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం జిల్లాలో వీరభద్రస్వామి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ సీపీ నేతలు, కార్యకర్తలు ఏపీ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెన్నుపోటు రాజకీయాలు, ప్రజలను మభ్యపెట్టే మాటలు తప్ప నీతి, నిజాయితీతో రాజకీయాలు చేయడం చంద్రబాబుకు రావన్నారు. నాలుగేళ్లుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. ధర్నాలు, దీక్షలు, బంద్‌లు, యువభేరీలు నిర్వహించి హోదా అవశ్యకతను ప్రజలకు వివరించారన్నారు. వైయస్‌ జగన్‌ పోరాటాలతోనే ప్రజల నోట ప్రత్యేక హోదా నినాదం వస్తుందని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఉద్యమంలో చేరితే దిక్కులేని పరిస్థితిలో చంద్రబాబు హోదా అంటూనే అరెస్టులు చేయించి బంద్‌ను విఫలం చేసేందుకు చూస్తున్నారన్నారు. అరెస్టులకు భయపడేది లేదని, హోదా సాధించే వరకు వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం ఆగదన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top