వైయస్‌ఆర్‌ సీపీని విమర్శించే అర్హత సుజయకు లేదు

విజయనగరం: ప్రలోభాలకు లొంగి తెలుగుదేశం పార్టీలో చేరిన సుజయకృష్ణ రంగారావుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని విమర్శంచే నైతక అర్హత లేదని పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. షుగర్‌ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు ఇవ్వలేక కోట నుంచి పారిపోయిన చరిత్ర సుజయదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కోలగట్ల మీడియాతో మాట్లాడుతూ.. తోటపల్లి, పెద్దగడ్డె సహా ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ దివంగత మహానేత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని గుర్తు చేశారు. బొబ్బిలిలో మూతపడిన పరిశ్రమలనే సుజయకృష్ణరంగారావు తెరిపించలేకపోయాడని ఎద్దేవా చేశారు. పైగా మమ్మల్ని విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. విజయనగరంలో జూనియర్‌ కళాశాలను తెచ్చింది మేమే అని చెప్పారు. తన భూములను కాపాడుకోవడానికి టీడీపీలో చేరి బీఫాం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించిన వైయస్‌ఆర్‌ సీపీపై నిందలు వేయడం తగదన్నారు.  

తాజా ఫోటోలు

Back to Top