రాబోయేది రాజ‌న్న రాజ్య‌మే
క‌ర్నూలు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న రాబోతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్ర‌భాక‌ర్‌రెడ్డి తెలిపారు. బుధ‌వారం  పేరాయిపల్లె గ్రామస్తులు వంద మంది గంగుల నాని నేతృత్వంలో ప్ర‌భాక‌ర్‌రెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా గంగుల మాట్లాడుతూ..దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో వ్యవసాయం పండుగలా సాగిందని, కానీ చంద్రబాబు పాలనలో దండుగలా మారిందని  ఎద్దేవా చేశారు.  దేశానికి వెన్నెముకగా ఉన్న రైతు మద్దతు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారికి అందాల్సిన మద్దతు ధర గురించి ఎప్పుడైనా కేంద్రాన్ని నిలదీశారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు రైతు ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని దుయ్యబట్టారు.  నాలుగేళ్లపాటు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు ఏం చేశారని ఆయ‌న‌ నిలదీశారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందంటూ ప్రశ్నించారు. రాష్ట్ర వృద్ధి రేటు బాగుందని చంద్రబాబు ప్రభుత్వం డప్పు కొట్టుకుంటోందని, అంత బాగుంటే అంతర్జాతీయ కన్సల్టెన్సీల అవసరం ఏందుకని నిలదీశారు. బాబు ఇప్పటికైనా స్వప్రయోజనాలు విడిచిపెట్టి, రైతుల కోసం కృషి చేయాలని హితవు పలికారు. వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ఆక‌ర్శితులై అన్ని పార్టీల నుంచి వైయ‌స్ఆర్‌సీపీలోకి వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌య్యాయ‌ని తెలిపారు.  
Back to Top