అధికారంలోకి రాగానే అందరికీ ఇళ్ల స్థలాలు

పశ్చిమగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వెంకటాపురం పంచాయతీ పరిధిలోని ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తామని ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. ఏలూరు రూరల్‌ వెంకటాపురంలో వైయస్‌ఆర్‌ సీపీ నేత రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆళ్ల నానితో పాటు పార్టీ నేతలు గుడిదేశి శ్రీనివాస్, ప్రసాద్, సుధీర్‌బాబులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి‡ హయాంలోనే వెంకటాపురం అభివృద్ధి జరిగిందన్నారు. వైయస్‌ఆర్‌ పాలన వైయస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాలు అందజేస్తామన్నారు. నవరత్నాలను పారదర్శకంగా అమలు చేసి ప్రజల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. 
 
Back to Top