వైఎస్సార్సీపీ సభ్యుల సస్పెన్షన్

అసెంబ్లీః  ప్రతిపక్షంపై భయంతో కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చకు టీడీపీ వెనుకంజ వేస్తోంది.  అంబేద్కర్ పై చర్చ పేరుతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సహా వైఎస్సార్సీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. మరికొందరు నేతలు అసెంబ్లీ వెల్ లో బైఠాయించారు.  కాల్ మనీ సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబు నిరంకుశ వైఖరి నశించాలి. మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న తెలుగుదేశం నేతలను శిక్షించాలని డిమాండ్ చేశారు. మార్షల్స్ తో బలవంతంగా వైఎస్సార్సీపీ సభ్యులనుబయటకు లాక్కెళ్లారు. 

టీడీపీ నేతలను రక్షించేందుకు చంద్రబాబు  కాల్ మనీ వ్యవహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారు.  చర్చ జరిగితే టీడీపీ నేతల గుట్టు రట్టయితుందని చంద్రబాబు ఐదురోజుల అసెంబ్లీసమావేశాలను మమ అనిపించే పనిలో ఉన్నారు. ఈక్రమంలోనే మహనీయుడు అంబేద్కర్ పేరు వాడుకుంటూ ఇప్పటికే రెండు రోజుల సభా సమయాన్ని టీడీపీ ప్రభుత్వం వృథా చేసింది. 

Back to Top