'మంత్రి రావెల కిశోర్‌బాబు తీరు దళిత జాతికే సిగ్గుచేటు'

హైదరాబాద్: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు వ్యవహరిస్తున్న తీరు దళిత జాతికే సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు.  ఈ మేరకు ఎమ్మెల్యేలు పాశం సునీల్‌కుమార్, కె. సర్వేశ్వర్‌రావు, పాలపర్తి డేవిడ్‌రాజు, ఉప్పులేటి కల్పన, గిడ్డిఈశ్వరి, విశ్వసరాయి కళావతి, వంతల రాజేశ్వరి, కె.సంజీవయ్యలు బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. సాటికులం వాళ్లని ఎలా గౌరవించాలో మంత్రి నేర్చుకోవాలని.. స్పీకర్ సాక్షిగా అసెంబ్లీలో గిరిజన మహిళా ఎమ్మెల్యేని వేలుపెట్టి చూపుతూ అసభ్య పదజాలంతో అవమానించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

ఆ శాఖను గిరిజనులకే ఇవ్వండి: ఈ నెల7 నుంచి 27 వరకు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో గిరిజన ఎమ్మెల్యేగా తనకు బుధవారమే మాట్లాడే అవకాశం వచ్చిందని, ఆ సమయంలో మంత్రి రావెల కిశోర్‌బాబు తనను కించపరిచే విధంగా మాట్లాడడం బాధకరమని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.
Back to Top