చర్చ జరపమంటే ఎందుకు భయపడుతున్నారు

అసెంబ్లీః రాజకీయాల కోసం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను కూడా
వాడుకోవడం దుర్మార్గమని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మహిళల
జీవితాలతో ఆడుకుంటున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశాన్ని చర్చించాలని
అడిగినందుకు తమను మార్షల్స్‌తో బలవంతంగా బయటకు తరలించారని ఎమ్మెల్యేలు
ఆవేదన చెందారు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో మందబలంతో ఎంత దుర్మార్గంగా
వ్యవహరించిందో ప్రజలంతా చూశారని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. అత్యంత
ముఖ్యమైన కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశంపై చర్చించడానికి అధికారపక్షానికి
తీరికలేదా అని ప్రశ్నించారు.

కాల్ మనీ  సెక్స్
రాకెట్ పై చర్చిద్దామంటే టీడీపీ నేతలు ఎందుకు భయటపడుతున్నారో
చెప్పాలన్నారు.  చంద్రబాబు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని అన్నారు.
కాల్ మనీ మీద ప్రభుత్వం ప్రకటన చేయడం కాదని...చర్చ జరిగితేనే దోషులు బయటకు
వస్తారన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top