స్టాప్ ర్యాగింగ్ పోస్టర్ ఆవిష్కరణ

  • ర్యాగింగ్ ను నిరోధించేలా చర్యలు
  • విద్యార్థి విభాగం పోరాటాలను గర్విస్తున్నాం
  • పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

రాష్ట్రవ్యాప్తంగా ర్యాగింగ్ ను అరికట్టేందుకు వైయస్సార్సీపీ ముమ్మర చర్యలు చేపట్టింది.  వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్థన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు జిల్లా విద్యార్థి విభాగం నాయకులతో కలిసి పార్టీ కార్యాలయంలో స్టాప్ ర్యాగింగ్ పోస్టర్ ను ఆవిష్కరించారు. మరోవైపు, వైయస్సార్ కడప జిల్లాలో ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రవి, వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి తదితరులు స్టాప్ ర్యాగింగ్ పోస్టర్ ను విడుదల చేశారు. 


సంస్కృతి సంప్రదాయాలను పక్కనబెట్టి ర్యాగింగ్ పేరుతో విద్యార్థులను మానసికంగా హింసిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేయడం దారుణమని ఎమ్మెల్యేలు అన్నారు. ర్యాగింగ్ వల్ల విద్యార్థులు చదువులు ఆపేయడంతో పాటు, ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయని  ఆవేదన వ్యక్తం చేశారు. యాంటీ ర్యాగింగ్ చట్టాలున్నా, పోలీస్ వ్యవస్థలు పనిచేస్తున్నాకూడా ర్యాగింగ్ విచ్చలవిడిగా విజృంభించడం హేయనీయమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో జరిగిన ఉదంతాలను దృష్టిలో ఉంచుకొని అధ్యక్షులు వైయస్ జగన్ ర్యాగింగ్ ను నిరోధించేందుకు చర్యలు చేపట్టారన్నారు. విద్యార్థి విభాగాలన్నంటికీ వైయస్సార్సీపీ పక్షాన యాంటీ ర్యాగింగ్ సెల్ ఏర్పాటు చేసే విధంగా ప్రధానమైన ఆలోచన కల్పించారన్నారు. 

వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు ప్రతీ స్కూల్, కాలేజీలకు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడి ర్యాగింగ్ ను నివారించేందుకు చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యేలు చెప్పారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు కేసులు, అరెస్ట్ లతో ఇబ్బంది పాలవుతున్నా మొక్కవోని దీక్షతో ర్యాగింగ్ ను అరికట్టేందుకు పోరాటాలు చేస్తున్నారన్నారు. అందుకు మేం చాలా గర్విస్తున్నామన్నారు. మా ప్రోత్సాహం విద్యార్థి నాయకులకు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.  

Back to Top