నల్లదుస్తులతో వైయస్సార్సీపీ ఎమ్మెల్యేల ర్యాలీ

హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై ఏపీ సర్కార్ వైఖరిని నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నల్లదుస్తులు ధరించి రవీంద్ర భారతిలోని ప్రకాశం పంతులు విగ్రహం నుంచి అసెంబ్లీకి ర్యాలీ తీశారు. నాడు రాష్ట్రాన్ని చీల్చిన చంద్రబాబు.. నేడు ప్రత్యేక  హోదాను తాకట్టు పెట్టారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.  కేసుల మాఫీ కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ప్రత్యేక హోదా ఏపీకి సంజీవనేననీ నినదించారు. ‘ప్రత్యేక హోదా భిక్ష కాదు, ఆంధ్రుల హక్కు’, ‘మీ ప్యాకేజీల కోసం ఆంధ్రప్రదేశ్ ను పణంగా పెట్టారు’, ‘నాడు రాష్ట్రాన్ని చీల్చావ్, నేడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టావ్’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు.

Back to Top