ప్రతిపక్ష నేత మైక్ కట్... స్పీకర్ పోడియం వద్ద మ్మెల్యేల నిరసన

ఏపీ అసెంబ్లీః బీసీ సంక్షేమం విషయమై సభ దద్దరిల్లింది . నూతన అసెంబ్లీ భవనంలోనూ ప్రభుత్వ తీరు మారలేదు. ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కుతోంది. ప్రతిపక్ష నేత ప్రసంగానికి స్పీకర్ అడుగడుగునా ఆటంకం సృష్టిస్తున్నారు.  2014–2015లో  బీసీలకు ఎంత ఖర్చు చేశారో చెప్పారు. అందులో రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ప్రతి ఏటా రూ.10 వేల కోట్లు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఎంత వరకు కేటాయించారు. 2015–2016లో ఎంత ఖర్చు చేశారంటే..అని వైయస్ జగన్  ప్రసంగిస్తుండగా స్పీకర్‌ మైక్‌ కట్‌ చేశారు. ప్రతిపక్ష సభ్యులు ఎంతగా స్పీకర్‌ను కోరినా ఆయన లెక్క చేయకుండా టీడీపీ ఎమ్మెల్యే జనార్ధరెడ్డికి మాట్లాడేందుకు మైక్‌ ఇచ్చారు. నిరసనగా వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో, స్పీకర్ సభను వాయిదా వేశారు.

Back to Top