సభలో వైయస్‌ఆర్‌సీపీ సభ్యుల నిరసన

ఏపీ అసెంబ్లీ:  పోలవరంపై చర్చలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం జరిగిన చర్చలో అధికార పార్టీ విమర్శలకు దిగడం, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సభ్యుల ఆందోళన అనంతరం వైయస్‌ జగన్‌కు మైక్‌ ఇచ్చినట్లే ఇచ్చి రెండుసార్లు కనెక్షన్‌ కట్‌ చేయడంతో వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు పోడియం వద్దకు చేరుకొని న్యాయం కావాలని నినాదాలు చేశారు. దీంతో స్పీకర్‌ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు.

Back to Top