అసెంబ్లీ ఎదుట వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల ధర్నా

ఏపీ అసెంబ్లీ: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బాలసుబ్రమాణ్యంపై జరిగిన దాడికి నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట ఆందోళన చేపట్టారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌ రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపారు. టీyî పీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రభుత్వ అధికారిపై, ఆయన గన్‌మెన్‌పై దాడి చేస్తే ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోకుండా సారీతో సరిపెట్టారని మండిపడ్డారు. వారు మాట్లాడుతూ..ఉద్యోగులపై ఇటీవల దాడులు అధికమయ్యాయని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటే తప్ప..మళ్లీ ఇలాంటివి పునావృతం కావని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. గతంలో చెయ్యని నేరానికి ప్రతిపక్ష ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అకారణంగా వేటాడి, వెంటాడి మరీ అరెస్టు చేశారని ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ఇప్పుడు బహిరంగంగా ఐఏఎస్‌ అధికారి, ఆయన గన్‌మెన్‌పై దాడికి పాల్పడినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Back to Top