ప్ర‌జ‌లే విశ్వాసం కోల్పోయారు-వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు


హైద‌రాబాద్‌) ప్ర‌జ‌ల అభీష్టానికి అనుగుణంగా న‌డుచుకోవ‌ట‌మే ప్ర‌తిప‌క్ష పార్టీ బాధ్య‌త అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. ప్ర‌భుత్వం మీద అవిశ్వాసం తెచ్చేందుకు శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శి కి నోటీసు ఇచ్చిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ప్ర‌భుత్వం మీద ప్ర‌జ‌లు విశ్వాసం కోల్పోయారు కాబ‌ట్టి త‌ద‌నుగుణంగా అవిశ్వాస తీర్మానం నోటీసు తెచ్చిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యేలు సుజ‌య క్రిష్ణ రంగారావు, చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, ఉప్పులేటి క‌ల్ప‌న త‌దిత‌రులు మీడియాతో మాట్లాడారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను ప్ర‌భుత్వం గాలికి వ‌దిలేసింద‌ని వెల్ల‌డించారు. రాజ‌ధాని ప్రాంతంలో మాఫియా త‌యారైంద‌ని వివ‌రించారు. దోచుకో...దాచుకో అన్న‌ట్లుగా పాల‌న సాగుతోంద‌ని వివ‌రించారు. 
Back to Top