కాసేప‌ట్లో స్పీక‌ర్‌ను క‌లువ‌నున్న వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు

అమ‌రావ‌తి:  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే వంత‌ల రాజేశ్వ‌రిని అన‌ర్హురాలిగా గుర్తించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు కాసేప‌ట్లో స్పీక‌ర్ కోడెలా శివ‌ప్ర‌సాద‌రావును క‌లువ‌నున్నారు. ఇటీవ‌ల వంత‌ల రాజేశ్వ‌రి టీడీపీలో చేరారు. ఆమెపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేయ‌నున్నారు. అలాగే గ‌తంలో పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌రోమారు కోరే అవ‌కాశం ఉంది.Back to Top