సమాఖ్య స్ఫూర్తికి విభజన విరుద్ధం

గౌరవనీయులైన స్పీకర్‌ గారికి
ఏపీ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ
హైదరాబాద్.
సర్,

శాసనసభ్యులమైన మేము ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్ అసెంబ్లీ‌ బిజినెస్‌ నిబంధన 167 ప్రకారం ఈ కింది కారణాల వల్ల రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పిటిషన్‌ను సమర్పించుకుంటున్నాం. ఆంధ్రప్రదే‌శ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013 క్లాజ్ 3లో ప్రతిపాదించిన ఆంధ్రప్రదే‌శ్ రాష్ట్ర విభజనను ఇందుమూలంగా వ్యతిరేకిస్తున్నాం.

ఆంధ్రప్రదే‌శ్ రాష్ట్ర విభజనను వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారత రాజ్యాంగలోని ప్రా‌థమిక అంశంగా ప్రకటించిన రాజ్యాంగ సంప్రదాయాలు, పద్ధతులకు భిన్నంగా, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా విభజన ప్రక్రియ మొదలైంది. అందువలన ఆంధ్ర, రాయలసీమ ప్రజల దృక్కోణం నుంచి పరిశీలిస్తే ఇది అన్యాయమైన నిర్ణయంగా పరిగణించడం జరిగింది.

రాజ్యాంగ విధివిధానాలు, స్ఫూర్తికి వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించడం ఒక ఎత్తయితే, వాస్తవాల ప్రాతిపదికపై చూస్తే ఈ నిర్ణయం వలన విభజనకు గురయ్యే సీమాంధ్ర ప్రాంతానికి అపార నష్టం వాటిల్లుతుంది.

ఎ) ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించే ఇంజన్‌ను కోల్పోవలసి ఉంటుంది.
బి) యువత ఉపాధి అవకాశాలను కోల్పోవలసి ఉంటుంది.
సి) అనుపాతంగా పొందవలసిన ఆదాయాన్ని కోల్పోవలసి ఉంటుంది.
డి) నికర జలాలను కోల్పోవలసి ఉంటుంది.
ఈ) సామాజిక, ఆర్థిక, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలన్నింటినీ కోల్పోవలసి ఉంటుంది.

హెచ్ఎండీఏ పరిధిలో సాధించిన తరహా అభివృద్ధిని సాధించాలంటే కనీసం 50 ఏళ్ళు పడుతుంది. అయినప్పటికీ ఇదంతా రాష్ట్రంలోని అత్యధిక శాతం ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా జరుగుతోంది. రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ జస్టి‌స్ శ్రీ కృష్ణ కమిటీ చేసిన సిఫార్సులకు పూర్తి భిన్నంగా ఈ‌ రోజున కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విభజన జరగకుంటే తెలంగాణా ప్రాంతం ఆర్థికంగాను మరో రకంగాను ఇబ్బందులను ఎదుర్కోదు. విభజన జరిగితే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఏ పాపమూ చేయకపోయినా 50 ఏళ్ళు వెనకబడిపోతాయి.

శ్రీకృష్ణ కమిటీ అదే విషయాన్ని ఈ విధంగా చెప్పింది :

'కాలక్రమేణా, మూడు దశాబ్దాల కాలంలో రాష్ట్రం ఆర్థిక, సామాజిక రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించింది. ఫలితంగా, ఆంధ్రప్రదేశ్ దేశంలో పురోగతి చెందుతున్న రాష్ట్రాలలో ముందు వరుసలో నిలిచింది. వాస్తవానికి ఈ పురోగతే ప్రత్యేక తెలంగాణా డిమాండ్ మళ్ళీ ఊపిరిపోసుకోవడానికి కారణమైంది. రాజకీయంగా మరింత ఎక్కువ పట్టు సాధించడం తెలంగాణా డిమాండ్ వెనుక ఉన్న అంతరార్థం.'

ఆంధ్రప్రదే‌శ్ విభజన సాధ్యం కాదు‌ :
ఆంధ్రప్రదేశ్ ప్రజలలో అత్యధిక శాతం, అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నప్పటికీ రాష్ట్ర విభజనపై యూపీఏ ప్రభుత్వం ఎందుకు చాలా దూకుడుగా ముందుకు పోతోంది?

అసెంబ్లీ ఎన్నికలలో వరుసబెట్టి రాష్ట్రం తర్వాత రాష్ట్రాన్ని కోల్పోతూ, ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన కేంద్ర ప్రభుత్వం తన పాలనకు గడువు ముగిసే సమయంలో రాష్ట్ర విభజనకు ఎందుకు నడుం బిగించింది?

ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం ఆ ప్రాంతంలో రగిలిన భావోద్వేగాలను వాడుకోవడం ద్వారా అధికార కాంగ్రె‌స్ పార్టీకి ఏవో కొన్ని సీట్లు సంపాదించపెట్టొచ్చన్న దుర్బుద్ధితో కాదా రాష్ట్ర విభజనకు అంకురార్పణ చేసింది?

వ్యవస్థాపిత రాజ్యాంగ సంప్రదాయాలు, ఫెడర‌ల్ స్ఫూర్తి పట్ల కేంద్ర ప్రభుత్వానికి కనీస గౌరవం లేదు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం జరిపిన రెండు ముఖ్యమైన న్యాయ కమిషన్లు..‌ జస్టిస్ సర్కారియా కమిషన్, జస్టి‌స్ పూంచ్ కమిష‌న్ పరిశీలనలను సైతం కేంద్ర ప్రభుత్వం పరిగణ‌నలోకి తీసుకోలేదు.

ఈ రెండు కమిషన్లు నిర్ద్వంద్వంగా చెప్పిన విషయం ఏమిటంటే :
ఏదైనా ఒక రాష్ట్రాన్ని విభజించడం కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా ప్రక్రియను ప్రారంభించడానికి ముందుగా ఏదైనా కమిషన్ లేదా కమిటీని నియమించి దాని నివేదిక ప్రాతిపదికపై గానీ లేదా సంబంధిత అసెంబ్లీ నుంచి విభజన కోరుతూ తీర్మానం వస్తే దాని ప్రాతిపదిక మీద గానీ తదుపరి చర్యలకు ఉపక్రమించాలి.

గతంలో రాష్ట్రాల విభజన సందర్భంగా పాటిస్తూ వచ్చిన పద్దతులు, సంప్రదాయాలను ఆంధ్రప్రదేశ్ విభజనకు వచ్చే సరికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించడం వెనుక కుతంత్రం దాగి ఉంది. చివరకు ఆంధ్రప్రదే‌శ్ విభజనకు సంబంధించి ఏర్పాటైన ఏకైక కమిష‌న్ అయిన జస్టి‌స్ శ్రీకృష్ణ కమిష‌న్ దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసి ఆంధ్రప్రదే‌శ్‌ను సమైక్యంగా ఉంచడమే అన్ని మార్గాలలోకి ఉత్తమమైనదిగా పేర్కొంటూ 461 పేజీల నివేదికను కేంద్రానికి సమర్పించింది. కేంద్రం కనీసం శ్రీకృష్ణ కమిషన్ సిఫార్సులను కూడా ఖాతరు చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించి విభజన నిర్ణయం తీసుకుంది.

శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని కొన్ని భాగా‌లు యధాతథంగా :
’విచారణ అనంతరం తేటతెల్లమైన విషయం ఏమిటంటే... ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న కోరిక ఎంత బలంగా ఉందో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న వాదన కూడా అంతే బలంగా వినిపిస్తోంది. అలాగే రాయలసీమ ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలంటూ ఆయా ప్రాంతాలకు చెందిన వివిధ వర్గాలు చేస్తున్న డిమాండ్ కూడా ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మా‌ర్గంగా పరిగణించవచ్చు. కాబట్టి ఈ డిమాండ్లు కూడా పరిశీలనార్హమైనవే. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న వాదన వైపే కమిటీ మొగ్గు చూపుతోంది.

జాతీయ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్దిని వేగవంతం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను సమైక్య రాష్ట్రంగా కొనసాగించాలని కమిటీ సూచిస్తోంది. దృఢమై రాజకీయ, పాలనా యాజమాన్యం ద్వారా ఈ ప్రత్యామ్నాయం సర్వజన హితమైనదని, రాష్ట్రంలోని అత్యధిక ప్రజానీకానికి సంతృప్తికరమైనదన్న విశ్వాసం ప్రజలలో కల్పించడం సాధ్యమే. విద్య, పారిశ్రామిక, ఐటి కేంద్రంగా విరాజిల్లుతున్న హైదరాబాద్ నగర భవితవ్యంపై ఏర్పడిన అనిశ్చితిని ఈ ప్రత్యామ్నాయం ద్వారా తొలగించవచ్చు. సమన్యాయం ప్రాతిపదికపై నీరు, సాగునీటి వనరుల యాజమాన్యం కోసం వాట‌ర్ మేనే‌జ్‌మెంట్ బో‌ర్డు, ఇరిగేషన్ ప్రాజె‌క్టు డెవలప్‌మెంట్ కార్పొరేష‌న్ వంటి సాంకేతిక సంస్థలను ఏర్పాటుచేసి వాటి పాత్రను విస్తృతపరచవలసిందిగా సిఫార్సు చేస్తున్నాం. పైన తెలిపిన కార్యాచరణ ద్వారా తెలంగాణా ప్రజలు లేవనెత్తిన సమస్యలన్నింటినీ వారి సంతృప్తి మేరకు పూర్తి చేయాలి.’

జస్టి‌స్ శ్రీకృష్ణ కమిష‌న్ పది మాసాల‌ పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రతినిధులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి తన సిఫార్సులతో సమగ్రమైన నివేదికను రూపొందించింది. ఇంత ప్రధానమైన నివేదికపై కూడా ఎలాంటి చర్చ జరపకుండానే కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా, నిర్హేతుకంగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి కనీసం తీర్మానం కూడా పొందకుండానే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు దిశగా విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టడం అత్యంత దురదృష్టకరం. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ న్యాయ కమిష‌న్‌ను ఎందుకు నియమించిందో, దాని నివేదికను, సిఫార్సులను ఎందుకు విస్మరించిందో ఊహకందని విషయం. అంటే నివేదికలో పేర్కొన్న వాస్తవాలు కేంద్ర ప్రభుత్వం ముందుగానే తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా ఉండటమే కారణమా?

తెలంగాణా కంటే ఎన్నో ఏళ్ళుగా పెండింగ్‌లో ఉన్న అదే తరహా డిమాండ్లను పక్కనపెట్టి కేవలం తెలంగాణా సమస్యను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు భావించిందో అర్థం కాలేదు. ఉదాహరణకు నాగపూర్ రాజధానిగా విదర్భ రాష్ట్రం ఏర్పాటు చేయవలసిందిగా 1956లోనే రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘం సిఫార్సు చేసింది. రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించాలని కోరుతూ ఉత్తరప్రదే‌శ్ అసెంబ్లీ మూడేళ్ళ కిందటే తీర్మానాన్ని ఆమోదించింది. గూర్ఖాలాండ్, బోడోలాండ్ డిమాండ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ఉత్తర కర్నాటక, దక్షిణ తమిళనాడు ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో స్థిరంగా అనుసరించాల్సిన విధి విధానాల గురించి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన కూడా ఉంది. విదర్భకు‌ ప్రత్యేక రాష్ట్రం అంశంపై ఆగస్టు 1, 2000నాడు కేంద్ర హోం మంత్రి పార్లమెంట్‌లో చేసిన ప్రకటన దీనిని స్పష్టం చేస్తుంది.

'1953-54లో ఏర్పాటు చేసిన రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘం సిఫార్సుల మేరకు భారతదేశంలోని రాష్ట్రాలను భాష ప్రాతిపదికపై పునఃవ్యవస్థీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు సరైన చర్య అవుతుంది. వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల నుంచి భిన్నమైన డిమాండ్లు ఉన్నాయి. విదర్భ ప్రాంత ప్రజలు ఒక ప్రత్యేకమైన డిమాండ్‌ను లేవనెత్తారు. మహారాష్ట్ర ప్రజలు దానిని వ్యతిరేకిస్తున్నారు. అందువలన ఈ విషయంలో మేము ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరించదలచుకున్నాం. ఏ ప్రాంతం నుంచైనా వచ్చే డిమాండ్‌కు దాని సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం ఉంటేనే ఆ డిమాండ్‌ను పరిశీలించి, ఆమోదించాలని నిర్ణయించుకున్నాం. అంతమాత్రాన రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించే  ప్రతి అంశాన్ని మేము అంగీకరిస్తామని కాదు. రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అసెంబ్లీ తీర్మానం ఆ రాష్ట్ర ప్రజల అభీష్టానికి, మనోభావాలకు అద్దం పడుతుంది.'

ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం మరొకటి ఏమిటంటే... 2009, డిసెంబర్ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం తెలంగాణా అంశంపై ప్రకటన చేస్తూ, రాష్ట్ర అసెంబ్లీలో తగిన తీర్మానం ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు.

చిదంబరం ప్రకటన సారాంశం ఇది :
'తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం. అందుకు తగిన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది.'

పైన చెప్పిన ఆచరణలో ఉన్న రాజ్యాంగ సంప్రదాయాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం చర్యలు ఏమాత్రం అంగీకారయోగ్యం కానివే. రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి, న్యాయ పాలనకు కట్టుబడిన బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేకుండా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు సాగుతున్న అప్రజాస్వామిక ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ ఇటీవల కాలంలో అనేకసార్లు మేము గౌరవనీయులైన ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాం. తక్షణమే రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరచి రాష్ట్ర విభజనపై దాని ఆమోదం పొందవలసిందిగా కోరుతూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి, శాసనసభ సభాపతికి అనేక లేఖలు రాశాం. అయితే దురదృష్టవశాత్తు ఏ సంప్రదాయాలను, పద్ధతులను పాటించకుండానే విభజన ప్రక్రియ ముందుకు సాగుతోంది.

ఎవరో వెంటబడి తరుముతున్నట్లుగా ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ పునఃవ్యవస్థీకరణ ముసాయిదా బిల్లును తయారుచేసి సభ్యుల అభిప్రా‌యాల కోసం ఆదరాబాదరాగా దానిని రాష్ట్ర అసెంబ్లీకి పంపించారు. ఈ ముసాయిదా బిల్లు ఉద్దేశాలు, కారణాలు ఏమిటో కూడా అందులో మాటమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. ముఖ్యమైన ఏ అంశంపై కూడా దానికి సంబంధించిన నేపథ్యాన్ని వివరించే సమాచారం లేదు. దీనిని బట్టి స్పష్టంగా అర్థం అవుతున్నది ఏమిటంటే రాష్ట్రంలోని 8.4 కోట్ల మంది జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అనేక అంశాలపై అర్థవంతమైన చర్చ, వాదన జరగడం కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ దురాచారం ప్రమాదకరమైన ఒక కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పుతుంది. భవిష్యత్తులో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేకుండానే, ప్రజల ఆమోదం పొందకుండానే రాష్ట్రాలను విభజించే అన్యాయమైన పద్దతికి ఇది దృష్టాంతం కాబోతుంది.

ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఉన్న కొన్ని విలక్షణమైన సమస్యలు :
మిగిలిన రాష్ట్రాల రాజధానుల మాదిరిగా కాకుండా గడచిన 57 ఏళ్ళ కాలంలో హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిట‌న్ డెవల‌ప్‌మెంట్ ఏరియా) ఆంధ్రప్రదే‌శ్ రాజకీయ రాజధానిగా మాత్రమే కాకుండా ఆర్థిక, ఉపాధి కల్పనకు శక్తిమంతమైన కేంద్ర బిందువుగా అవతరించింది. ప్రభుత్వ, ప్రైవే‌ట్ రంగాలకు చెందిన అనేక మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలతో‌ పాటు పౌర, రక్షణ రంగానికి చెందిన పరిశోధనా సంస్థలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అన్న ఒకే ఒక కారణంతో గడచిన 57 ఏళ్ళ కాలంలో భారీ పెట్టుబడులతో పెద్ద సంఖ్యలో ‌హైదరాబాద్ చుట్టుపక్కల అనేక పరిశ్రమలు వచ్చాయి. అలా కాని పక్షంలో ఈ పెట్టుబడులలో కొంత భాగం రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించి ఉండేవి.

ఉదాహరణకు, 1990 మధ్య వరకూ కేంద్ర ప్రభుత్వం ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ రంగాన్ని సాధనంగా ఉపయోగించుకుంది. దురదృష్టవశాత్తు, ఆంధ్రప్రదే‌శ్ విషయంలో 90 శాతం పెట్టుబడులు హైదరాబా‌ద్ చుట్టుపక్కలే కేంద్రీకృతమయ్యాయి. మిగిలిన రాష్ట్రాలలో ఇవి అన్ని ప్రాంతాలలోనూ విస్తరించాయి. బీహెచ్‌ఈఎ‌ల్ ఇక్కడ ‌హైదరాబాద్‌కు మంజూరు చేస్తే.. యూపీలో హరిద్వార్‌లోనూ, తమిళనాడులో తిరుచ్చిలోనూ స్థాపించారు. హెచ్‌ఏఎల్‌ను హైదరాబాద్‌లో స్థాపిస్తే ఒడిషాలో గిరిజన ప్రాంతమైన కోరాపుట్‌లో, మహారాష్ట్రలో నాసిక్‌లో నెలకొల్పారు. హెచ్‌ఎమ్‌టి, బీడీఎల్, ఐడీపీఎల్, ఈసీఐఎల్, బిఇఎల్, మిధానీ, ఎన్‌ఎఫ్‌సి, ఎన్‌ఎమ్‌డిసి, ఎన్‌ఆర్‌ఎస్‌ఎ, ఎన్‌జిఆర్‌ఐ, ఎన్‌ఎఫ్‌డిబి, డిఎమ్‌ఆర్‌ఎల్, హెచ్‌సిఎల్, డిఎల్‌ఆర్‌ఎల్, డిఆర్‌డిఎల్, సిసిఎమ్‌బి, ఐఐసిటీ, డీఆర్‌డిఓ సంస్థలుకూడా హైదరాబాద్‌లోనే నెలకొల్పారు. వీటి యూనిట్లు ప్రైవేట్ సెక్టారులో గ్లోబ‌ల్ యూనిట్లుగా మారాయి.

90 శాతం పైగా ప్రైవేటు పెట్టుబడులు ఆంధ్ర ప్రాంతం నుంచే వచ్చాయి. స్వాతంత్య్రం రాకపూర్వం నుంచి వారు వ్యాపారంలో దిట్టలుగా పేరు గడించారు. వీటిలోని కొన్ని ప్రైవే‌ట్ సంస్థలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయి. ఉదాహరణకు‌ :

సాఫ్టువేర్ టర్నోవర్ 55 వేల కోట్లు (స్థానిక‌, ఎగుమతులు కలుపుకుని) కాగా ఒక్క హైదరాబాద్‌లో 2012-13 సంవత్సరంలో 54,800 కోట్లు టర్నోవర్ నమోదైంది. ఈ కారణంగా రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు వ్యవసాయ ఆధారిత ప్రాంతాలుగానే మిగిలిపోయాయి.

ఉన్నత విద్యా సంస్థలైన ఐఐటీ, ఐఎ‌స్‌బి, ఐఐఐటి, ఐఐఎఫ్‌టి, నల్సర్, కేంద్రీయ విశ్వవిద్యాలయం, బిట్సు, టిఐఐఎస్, టిఐఎఫ్‌ఆర్, వైద్య సంస్థలు కూడా హైదరాబాద్‌ పరిసరాలలో కేంద్రీకృతమయ్యాయి. భారతదేశంలోనే ఒక ఏడాదిలో అత్యధిక చిత్రాలు నిర్మించే తెలుగు సినిమా పరిశ్రమ కూడా ఇక్కడే ఉంది. ఆర్థికాభివృద్ధిలో ఇటువంటి అసాధారణ పరిస్థితి వేరే ఏ రాష్ట్రంలోనూ లేదు. అయితే బెంగళూరు ఒక్కటే దీనికి మినహాయింపు.

దీనివల్ల రాష్ట్ర ఆదాయంలో 60 శాతం హెచ్‌ఎండీఏ ప్రాంతం నుంచే వసూలవుతోంది. మొత్తం ఆదాయంలో 75 శాతం తెలంగాణ ప్రాంతంలోనే వస్తోంది. తెలంగాణ జనాభా రాష్ట్రంలో నలబై శాతం మాత్రమే అన్న విషయం ఇక్కడ గమనార్హం. కొత్తగా ఏర్పడిన జార్ఖండ్, ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్ విషయంలో ఇలాంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ఆదాయంలో అమ్మకం పన్ను (వాట్) ద్వారా వసూలు అయ్యేది సుమారు 65 శాతం.

అమ్మకం పన్నుపై శ్రీకృష్ణ కమిష‌న్ నివేదికలోని కొన్ని వ్యాఖ్యలు‌:
'ప్రాంతాలవారీగా జమ అవుతున్న అమ్మకం పన్ను :
2008-09 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో అమ్మకం పన్ను కింద 22 వేల కోట్ల రూపాయలకు పైబడి జమ అయింది. ఇందులో 75 శాతం మొత్తాలు కేవలం హైదరాబాద్ నుంచే వచ్చాయి. అమ్మకం పన్ను విభాగాల ప్రకారం పన్ను వసూళ్ళు జరుగుతాయి. ఒక్కో విభాగం ఒకటి కంటే ఎక్కువ జిల్లాల నుంచి వసూళ్ళు చేస్తుంది. అయినప్పటికీ హైదరాబా‌ద్‌ను మినహాయిస్తే వర్తక, వాణిజ్య కార్యకలాపాలన్ని కోస్తా ఆంధ్రాలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. అక్కడ పన్ను వసూళ్ళు 15 శాతం మాత్రమే జరుగుతాయి. ఇక తెలంగాణాలో పన్ను వసూళ్ళు 8 శాతం ఉండగా, రాయలసీమలో అది 3 శాతం మాత్రమే ఉంది.'

అందువల్ల విభజన జరిగితే, 2012-13 సంవత్సరంలో జిల్లాల వారీగా వసూలైన అమ్మకం పన్ను ప్రాతిపదికగా పరిగణిస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం వసూళ్ళలో కేవలం 25 నుంచి 30 శాతంతోనే సీమాంధ్ర ప్రాంతం సరిపెట్టుకోవలసి ఉంటుంది. భౌగోళికంగా 60 శాతం ప్రాంతంతో అత్యధిక జనాభా కలిగిన సీమాంధ్ర ప్రాంతానికి దక్కేది 25-30 శాతం వసూళ్ళు మాత్రమే. ఒక రాష్ట్రం ఆదాయాన్ని మరొక రాష్ట్రానికి పంచడానికి రాజ్యాంగపరంగా ఎలాంటి అధికారం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 కింద కేవలం కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని మాత్రమే రాష్ట్రాలతో పంచుకోవచ్చు. దీనివలన ఎదురయ్యే అతి పెద్ద సమస్య ఆదాయం. విభజన జరిగి వేరుపడితే మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడానికి ఇతర అభివృద్ధి, సామాజిక కార్యకలాపాలకు నిధులు వెచ్చించే సంగతి అలా ఉంచి, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి అవశేష రాష్ట్రం ఎక్కడికి పోవాలి? జనాభా ఆధారంగా పంచిన రుణాలను చెల్లించడానికి ఏం చేయాలి? ప్రస్తుత ఆంధ్రప్రదే‌శ్ రాష్ట్ర ఆదాయంలో కేవలం 25-30 శాతం మాత్రమే పొందగల అవశేష రాష్ట్రం అప్పులు మాత్రం 60 శాతం జనాభా ప్రాతిపదికన పంచుకోవలసి ఉంటుంది. ఈ పరిస్థితి ఆ రాష్ట్ర ప్రజలకు చావుదెబ్బ కాదా?

1991 తరవాత కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ తప్పు పభుత్వ రంగంలో పెట్టుబడులను నిలిపేసింది. ఇలాంటి పరిస్థితుల్లో బీహెచ్‌ఈఎల్, హెచ్‌ఎంటీ, ఈసీఐఎల్, ఎన్‌ఎ‌ఫ్‌సీ, బీఈఎల్, బీడీఎల్, డిఎంఆర్‌ఎల్, డీఆర్‌డీఎల్, డీఆర్‌డీవో, హెచ్‌సీఎల్, మిధానీ, హెచ్‌ఏఎల్, ఎన్‌ఆర్‌ఎస్‌ఏ వంటి ప్రభుత్వ రంగలోని పారిశ్రామిక, రక్షణ సంస్థలను కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది. లెసైన్సింగ్ చట్టాన్ని తొలగించనందున కొత్తగా ప్రైవేటు పెట్టుబడులను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందనేది కూడా మౌలికమైన ప్రశ్న.

సా‌ఫ్టువేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలూ, 60 శాతం వ్యాపారం కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వగలదా? తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తరవాత సీమాంధ్రకు పుండు మీద కారం జల్లినట్లు ఇప్పటికే సా‌ఫ్టువేర్ పరిశ్రమ వేళ్ళూనుకున్న హైదరాబా‌ద్‌కే కేంద్ర ప్రభుత్వం ఐటిఐఆర్‌ను మంజూరు చేసింది.

ఆర్థిక లావాదేవీలు లేక, దివాలా తీసిన స్థితిలో కొత్తగా ఏర్పడే రాష్ట్రాన్ని నడిపేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సాగునీరు అందుతుందన్న భరోసా కూడా లేని వ్యవసాయాధారిత రాష్ట్రంగానే సీమాంధ్ర మిగిలిపోవాలా? తమ రాజధాని అనే ఉద్దేశంతో హైదరాబాద్‌ను అద్వితీయ ఆర్థిక శక్తిగా రూపుదిద్దేలా కృషిచేయడమే దీనికి కారణమా? హైదరాబాద్‌లో ఉన్న పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు అక్కడికే పరిమితమైతే.. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల పరిస్థితి ఏమిటి?

నదీ జలాల పంపిణీపై ప్రస్తుతం నిర్ణీత వ్యవస్థ లేదు. ఎగువ రాష్ట్రాలు తమ వాటాను వినియోగించుకున్న అనంతరం మిగులు జలాలను వర్షాభావ సంవత్సరాలలో ఎలా పంపిణీ చేయాలనే అంశంపై నియంత్రణ కరవైంది. సుప్రీం కోర్టు, వాటర్ ట్రైబ్యున‌ళ్ళ ఆదేశాలను సైతం ఎగువ రాష్ట్రాలు ఉల్లంఘించి దిగువ రాష్ట్రాలకు రావాల్సిన నీటికి కూడా వాడుకుంటున్నాయి. వర్షాభావ సంవత్సరాలలో అవి కింది రాష్ట్రాలకు నీటిని విడుదల చేయడంలేదు. వారి అవసరాలు తీరిన తరవాత మాత్రమే.. అవి నీటిని వదులుతున్నాయి. బాధ, సంతోషం సమానంగా పంచాలనే సూత్రం ఇక్కడ ఆచరణకు నోచుకోవడం లేదు.

సమైక్య రాష్ట్రానికి నదీజలాల విడుదలపై ఇన్ని ట్రైబ్యునళ్ళు, బోర్డులు ఉన్నప్పటికీ పై రాష్ట్రాల అవసరాలు తీరితే తప్ప నీటిని విడిచిపెట్టడం లేదు. మహారాష్ట్ర తన అవసరాలు తీరిన తరవాత కర్ణాటకకు నీటిని ఇస్తుంది. కర్ణాటకలోని నారాయణపూర్, ఆలమట్టి డ్యాంలు నిండితే తప్ప కింద ఉన్న మనకు నీరు రావడంలేదు. సమైక్యంగా ఉన్నప్పుడే పరిస్థితి ఎలా ఉంటే విభజన జరిగి మధ్యలో మరో రాష్ట్రం వస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. అప్పుడు శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలు ఎలా నిండుతాయి. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ సముద్రం నీరు తప్ప మంచినీరు ఎక్కడా లేదు. తెలంగాణ ప్రాంతంలో రెండున్నర జిల్లాలు ఉన్న కృష్ణా ఆయకట్టును ప్రభుత్వం ఎలా విడదీయగలదు. కృష్ణా ఆయకట్టు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లోని ఎనిమిదిన్నర జిల్లా‌ల్లో విస్తరించి ఉంది. ఇది రోజూ నీటి యుద్ధాలకు దారితీయదా?

విచారణ అధికారాలు ఉన్న ప్రభుత్వ అనుబంధ న్యాయ వ్యవస్థ లేకుండా నదీ పరీవాహక ప్రాంత నిర్వహణ కష్టతరమవుతుంది. అలాంటి వ్యవస్థ ఉంటేనే నది చివరి ప్రాంతాలకు వాటి హక్కు మేరకు నీటిని అందించడం సాధ్యమవుతుంది. వర్షాభావం నెలకొన్న సంవత్సరాలలో ఈ వ్యవస్థ ఆదుకుంటుంది.

పోలవరం విషయానికి వస్తే భద్రాచలం రెవెన్యూ డివిజన్, కుక్కునూరు మండలం, వేలేరుపాడు మండలం, గణపవరం, రాయీగూడెం, బూర్గుంపాడు మండలంలోని శ్రీధర గ్రామాలు ముంపునకు గురవుతాయి. తెలంగాణ ప్రాంతం నుంచి నీటిని విడుదల చేయకపోతే పోలవరం ప్రాజెక్టుకు నీరెలా వస్తుంది.

ఇప్పుడు తెలంగాణవాదులు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుగుతున్నారు. ఈ ప్రాంతానికి ప్రత్యేక రాజకీయ ప్రతిపత్తి చరిత్రలో ఎక్కడా లేదు. ఎస్‌ఆర్‌సీ సిఫార్సు మేరకు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. 1956లో ఇలా ఒక్క ఆంధ్రప్రదే‌శ్ కాకుండా మరో మూడు భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మరికొన్ని దేశవ్యాప్తంగా వెలురించిన అభిప్రాయం ఆధారంగా ఆవిర్భవించాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో అనేక ప్రాంతాలు కలిశాయి. ఇలా కలిసింది తెలంగాణ ప్రాంత‌ం ఒక్కటే కాదు. అలాగే, ఇలాంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల నుంచి అనేక ప్రాంతాలు విడిపోయాయి కూడా. హైదరాబాద్ రాష్ట్రంతో పాటు, పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదే‌శ్‌లో కలిసింది. హైదరాబాద్ రాష్ట్రం నుంచి మరాఠీ మాట్లాడే ఆరు జిల్లాలు మహారాష్ట్రలోనూ, కన్నడ భాష మాట్లాడే 3 జిల్లాలు కర్ణాటకలోనూ కలిశాయి.

‌శ్రీకృష్ణ కమిష‌న్ 1.1.10 పేరాలోని అంశం ప్రస్తావనార్హం :

‘ఎస్‌ఆర్‌సీ నివేదికను 1955 నవంబర్ 25నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకూ చర్చించింది. అసెంబ్లీలోని 175 మంది సభ్యులలో 147 మంది తమ అభిప్రాయాలను చర్చలో వెల్లడించారు. ఇందులో 103 మంది విశాలాంధ్రను, 29 మంది స్వతంత్ర హైదరాబా‌ద్‌ను సమర్థించగా, 15 మంది తటస్థంగా ఉండిపోయారు. మిగిలిన రాష్ట్రాలలో 59 మంది విశాలాంధ్రకు మద్దతు పలకగా, 25 మంది ప్రత్యేక హైదరాబాద్‌కు మద్దతు తెలిపారు. ఒకరు తటస్థంగా ఉన్నారు.’

ఇంత పెద్ద మెజారిటీతో సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో కలవాలని ఆకాంక్షించగా.. ఇది బలవంతంగా జరిగిందని అనడం ఎంతవరకూ సమంజసం? ఇలాంటి తీర్మానమే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా చేసింది.

స్వాతంత్య్రానంతరం అత్యంత దుర్బలమైన ఆర్థిక స్థితిని ఎదుర్కొంటున్న ప్రస్తుత దశలో ఇటువంటి సమస్యకు కేంద్రం ఎందుకు తెరదీసింది. కొత్త రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్రం ప్రస్తుతం కొన్ని వేల‌ కోట్లను కూడా కేటాయించలేని పరిస్థితిలో ఉంది. జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ మాదిరిగా సామాజిక , ఆర్థిక, విద్య అంశాలకు మౌలిక వనరులను సమకూర్చుకోవాల్సి రావడమే కాకుండా.. ఆదాయ వనరులను ఏర్పాటు‌ చేసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి స్థితిలో కొత్త రాష్ట్రం ఏ రకంగా మనుగడ సాగించగలదు?

పదేళ్ళ పాటు రాజధానిని హైదరాబాద్‌లో కొనసాగించుకోవచ్చనే అవకాశాన్ని మాత్రమే కేంద్రం ఆంధ్ర ప్రాంతానికి కల్పించింది.  పదేళ్ళలో హైదరాబాద్‌ లాంటి రాజధాని నగరాన్ని నిర్మించుకోవడం సాధ్యమేనా? కేంద్ర ప్రభుత్వ చర్య యజమానిని తన సొంత ఇంటి నుంచి ఖాళీ చేయించినట్లుంది. 60 ఏళ్ళ పాటు శ్రమించి నిర్మించుకున్న ఇంటిలోనే పదేళ్ళపాటు అద్దెకు ఉండాల్సిన అగత్యాన్ని కేంద్రం సీమాంధ్ర ప్రాంతానికి కల్పించింది.

57 ఏళ్ళ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం ఏ కోణంలో చూసినా ఆంధ్ర, రాయలసీమ ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదే‌శ్‌లోనే కాకుండా దేశంలో కూడా విపరీత పరిణామాలకు దారితీస్తుందని భావిస్తున్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏపీ. జీడీపీలో దేశంలోనే మూడో స్థానంలో ఉంది. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలే మనకంటే ముందున్నాయి. హిందీ తరవాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఈ రాష్ట్రాన్ని విడదీయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి దారితీసిన బలీయమైన కారణమేమిటి? ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే సహేతుకమైన కారణం ఉండాలి. రాష్ట్రాన్ని విభజించడానికి ప్రాంతీయ వాదాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే 1947 కంటే ముందున్న వాటి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఏర్పడతాయి. ఆ సమయంలో 563 రాజరిక వ్యవస్థలు ఉండేవి. ఇది దేశ సార్వభౌమాధికారానికి, సమైక్యతకు గొడ్డలిపెట్టులా పరిణమిస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయానికి మేం వ్యతిరేకం :
ఎ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యధిక ప్రజలు, వారి ప్రతినిధులు నిష్కర్షగా విభజనను వద్దంటున్నారు.
బి) నిర్ణీత కారణం, ఆధారం, అర్ధంగీకార పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఆర్టిక‌ల్ 3ను ప్రయోగించడానికి వీలు కల్పిస్తోంది. దీని ప్రకారం సంబంధిత అసెంబ్లీ తీర్మానం మేరకే విభజనకు అవకాశముంటుంది.
సి) కానీ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ మాదిరిగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఆర్టిక‌ల్ 3 ప్రకారం తీర్మానం చేయలేదు.
డి) ఇలా చేయడం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుకు వ్యతిరేకం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే అత్యంత ఉత్తమమైనదని కమిటీ సిఫార్సు చేసింది.
ఇ) విభజించడం సమాఖ్య స్ఫూర్తికి కూడా విరుద్ధం. సమాఖ్య విధానం భారత రాజ్యాంగ ప్రాథమిక సూత్రం.
ఎఫ్) 1988లో జస్టి‌స్ సర్కారియా కమిషన్, 2010లో జస్టి‌స్ ‌పూంచి కమిషన్‌లు ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై చేసిన పరిశీలనలో వెల్లడైన అంశాలకు కూడా విభజన విరుద్ధం.
జి) 2000 ఆగస్టు ఒకటో తేదీన పార్లమెంటులో అప్పటి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేసిన విధాన నిర్ణయానికి ఈ విభజన విరుద్ధం. రెండో ఎస్సార్సీ నియామకం ద్వారా, లేదా.. సంబంధిత అసెంబ్లీ నుంచి ఏకగ్రీవ తీర్మానం ద్వారా మాత్రమే కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తామన్నది ఆ ప్రకటన సారాంశం.
హెచ్) 2010 ఫిబ్రవరి 3, 4 తేదీలలో లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన భోపాల్‌లో ఏర్పాటైన 74వ ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయానికి కూడా ఇది వ్యతిరేకం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిష‌న్ సిఫార్సు మేరకే కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరగాలనేది ఆ సదస్సు తీర్మాన సారాంశం.
‌ఐ) ఆర్టికల్ 371డి ఏ లక్ష్యాన్నైతే సాధించలేకపోయిందో ఆ అంశాన్ని సరిగ్గా అంచనా వేయకుండానే ప్రభుత్వం రాష్ట్ర విభజనకు పూనుకుంది.
జె) విభజన అవశేష రాష్ట్రానికి తీవ్ర నష్టాన్నీ కలిగిస్తుంది. అన్యాయాన్ని మిగులుస్తుంది. ఆర్థిక పురోగతినీ, ఉద్యోగావకాశాలనూ, సామాజిక, విద్య, ఆరోగ్య స్థితి గతులనూ, నదీ జలాలలో వాటానూ కూడా దెబ్బతీస్తుంది.

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని 2004 లేదా 2009 ఆంధ్రప్రదేశ్ కాంగ్రె‌స్ ‌మేనిఫెస్టోలో ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ కింద ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రె‌స్ ‌మేనిఫెస్టోలను ఒక్కసారి పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రె‌స్ మానిఫెస్టో 2004‌ :
తెలంగాణా సమస్య :
'ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణా ప్రాంత ప్రజలలో ప్రబలుతున్న ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తోంది. దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి డిమాండ్లు ఉన్నాయి. 2000 అక్టోబర్ 30న జరిగిన కాంగ్రె‌స్ వర్కింగ్ కమిటీ (సీడబ్లూసీ) సమావేశం ఈ సమస్యపై దృష్టి సారిస్తూ ఈ విధంగా స్పందించింది. మొట్టమొదటి రాష్ట్రాల పునర్విభజన కమిష‌న్ నివేదికను గౌరవిస్తూనే, విదర్భ, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు అనేక సహేతుకమైన కారణాలు‌ ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల పునర్విభజన అనేక సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఈ మొత్తం వ్యవహారం మరో రాష్ట్రాల పునర్విభజన కమిష‌న్ ఏర్పాటు ద్వారా మాత్రమే కొలిక్కి తీసుకురాగలమని కాంగ్రె‌స్ పార్టీ భావిస్తోంది.'

ఆంధ్రప్రదే‌శ్ కాంగ్రె‌స్ ‌మేనిఫెస్టో 2009 :
'తెలంగాణా సమస్యపై పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించిన వైఖరిని గౌరవిస్తామని కాంగ్రెస్ ప్రతిన బూనుతోంది. కాంగ్రె‌స్ ప్రభుత్వం ఇప్పటికే కాంగ్రె‌స్ నాయకుడు కె.రోశయ్య అధ్యక్షతన ఉభయ సభల సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.'

తెలంగాణాపై 2004లో రాష్ట్రపతి ప్రసంగం‌ :
రెండు దశాబ్దాల క్రితం సర్కారియా కమిషన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేసింది. అప్పటి నుంచి భారతదేశ ఆర్థిక, రాజకీయ రంగాలలో వచ్చిన అనేక మార్పులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం ప్రభుత్వం కొత్త కమిష‌న్‌ను ఏర్పాటు చేస్తుంది. అందరితో తగిన రీతిలో సంప్రదింపులు జరిపిన అనంతరం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌ను తగిన సమయంలో ప్రభుత్వం పరిశీలిస్తుంది.

ఏ విధంగా చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన 57 ఏళ్ళ తర్వాత, ఆంధ్ర, తెలంగాణా ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం ఒక్క ఆంధ్రప్రదే‌శ్‌లోనే కాకుండా యావత్ దేశంలోనే అనేక రాజకీయ విపరిణామాలకు దారి తీసే ప్రమాదం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత దేశంలోనే మూడవ అతిపెద్ద జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)ని కలిగి, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదే‌శ్ ఒకటి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధిని నమోదు చేస్తున్నాయి.

ఈ దశలో రాష్ట్రాన్ని విభజన నిర్ణయం ఏమాత్రం హేతుబద్దంగా కనిపించడంలేదు. ఉదారవాద ప్రజాస్వామ్యం కలిగిన మన దేశంలో మన ప్రభుత్వాలు తీసుకునే ఎలాంటి నిర్ణయం అయినా సహేతుకంగాను, లక్ష్యపూరితంగాను ఉండి తీరాలి. ఒక ప్రాంతంలోని ప్రజల మనోభావాలను ప్రాతిపదికగా చేసుకుని మరో ప్రాంతం ప్రజల మనోభావాలను పరిగణ‌నలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయిస్తే చివరికి భారతదేశం చీలికలు... పేలికలై 1947కు పూర్వం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఏర్పడి, దేశ సమైక్యత, సమగ్రతలకే ముప్పు తెచ్చే పరిస్థితి దాపురించడం తథ్యం. రాష్ట్రాన్ని విభజించడం కంటే ప్రాంతీయవాదాలను గౌరవిస్తూ ఆయా ప్రాంతాలనూ అభివృద్ధిచేస్తూ ముందుకు సాగాలి. 1947కు పూర్వం 563 రాజరిక ఆధారిత రాష

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top