సుబ్బ‌య్య‌ను అరెస్టు చేయాలిగుంటూరు: మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్ప‌డిన సుబ్బ‌య్య‌ను వెంట‌నే అరెస్టు చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ముస్త‌ఫా డిమాండు చేశారు.  దాచేప‌ల్లిలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్లు కొనిస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి సుబ్బయ్య అనే నిందితుడు అత్యాచారానికి పాల్పడ‌టంతో తీవ్ర ఉధృక్త‌త నెల‌కొంది. బాధిత కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండ‌గా నిలిచింది. ఈ మేర‌కు ఎమ్మెల్యేలు ముస్త‌ఫా, ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి త‌దిత‌రులు ఆందోళ‌న‌లో పాల్గొని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ..రాజ‌ధాని ప్రాంతంలో వ‌రుస‌గా మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు జ‌రుగుతున్నా ప్ర‌భుత్వం చోద్యం చూస్తుంద‌న్నారు. దాచేప‌ల్లిలో చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించిన సుబ్బయ్యను వెంటనే అరెస్ట్‌ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండు చేశారు.
Back to Top