ఎమ్మెల్యేల‌ను గౌర‌వించ‌రా-వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు

హైద‌రాబాద్‌) శాస‌న‌స‌భ వాయిదా ప‌డిన త‌ర్వాత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ ద‌గ్గ‌ర మాట్లాడారు. ఎమ్మెల్యేల‌కు నిధులు ఇవ్వ‌కుండా అడ్డుకోవ‌టం ఎటువంటి సాంప్ర‌దాయం అని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు. వ‌య‌స్సుకి త‌గిన‌ట్లుగా హుందాగా ప్ర‌వ‌ర్తించ‌టం మంచిద‌ని హిత‌వు ప‌లికారు. ఎమ్మెల్యేగ్రాంట్లు అడ్డుకొంటే హీరోలు అవుతారా అని నిల‌దీశారు. పార‌దర్శకంగా వ్య‌వ‌హ‌రించాల‌ని పిలుపు ఇచ్చారు. మ‌రో ఎమ్మెల్యే ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వాల‌ని కోరారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పాటిస్తున్న సాంప్ర‌దాయ‌మే అని పేర్కొన్నారు. 

Back to Top