దోపిడీ టార్గెట్‌గా చంద్రబాబు పాలన

పుష్పగిరి ఆలయ స్థలాలు కబ్జా చేసిన టీడీపీ నేతలు
పోలీసులను అడ్డుపెట్టుకొని చంద్రబాబు పాలన
రాజధానిలో ఒక్క శాశ్వత ఇటుకైనా పడిందా బాబూ?

వైయస్‌ఆర్‌ జిల్లా: రైతుల భూములు, ఆలయ స్థలాల దోపిడీనే టార్గెట్‌గా చంద్రబాబు పాలన కొనసాగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, కడప మేయర్‌ సురేష్‌బాబు ధ్వజమెత్తారు. బాబు పాలన అంతా అవినీతి మయంతో కొనసాగుతుందన్నారు. కడపలో వారు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు పుష్పగిరి ఆలయ స్థలాలను కబ్జా చేశారని మండిపడ్డారు. పోలీసులను అడ్డుం పెట్టుకొని చంద్రబాబు పాలన సాగిస్తున్నాడన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజలు ఒక్క మంచి పనిచేసిన దాఖలాలు లేవన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా అవినీతి, దోపిడీ, వర్గప్రీతి తప్ప మరేమీ లేదన్నారు. నీరు–చెట్టు కార్యక్రమంతో పచ్చ చొక్కల కార్యకర్తలు విచ్చలవిడిగా దోపిడీ చేశారని, విదేశీ పర్యటనతో చంద్రబాబు వందల కోట్ల ప్రజాధనం వృథా చేశాడని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. దేవుడి భూములను కూడా వదలకుండా ఆక్రమించుకుంటున్నారన్నారు. నాలుగున్నరేళ్లుగా రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక్క శాశ్వత ఇటుక పడలేదన్నారు. 
వైయస్‌ జగన్‌తోనే సంక్షేమం..
ప్రజల సంక్షేమమే ఊపిరిగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారని ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా అన్నారు. పాదయాత్రలో అనేక సమస్యలు వైయస్‌ జగన్‌ దృష్టికి వస్తున్నాయని చెప్పారు. జననేత ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు మంచి పాలన అందుతుందని, రాజన్న రాజ్యం తిరిగి వస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. 
Back to Top