చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం

క‌డ‌ప‌) క‌డ‌ప న‌గ‌రంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. రాయలసీమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా సీమ రౌడీలంటూ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మితే ప్రాణానికి ప్రాణం ఇచ్చేది కడప వాసులేనని, చంద్రబాబులా ద్రోహులు కాదని మండిపడ్డారు. రాష్ట్ర విభజన కోసం కేంద్రానికి లేఖ ఇచ్చింది మీరు కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఇప్పుడు విభజనపై బాబు మాటమార్చి ఇతరులను నిందిస్తున్నారని మండిప‌డ్డారు. 
Back to Top