బాబువి నీతిమాలిన రాజకీయాలు

పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు
బాబు నీచ కార్యక్రమాలపై జాతీయస్థాయిలో పోరాడుతాం
ఫిరాయింపులపై రాష్ట్రపతి, ప్రధాని, ఈసీలకు ఫిర్యాదు చేస్తాం
ఫిరాయింపుదారులు రాజీనామా చేయాలిః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 

ఢిల్లీః అధికార దాహంతో చంద్రబాబు రాష్ట్రంలో నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ... పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశ్యంతోనే వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నేతలు ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు.  చంద్రబాబు దుర్మార్గాలను ఎండగట్టేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. బాబు దుర్నీతిపై రాష్ట్రపతి, ప్రధాని, ఈసీలకు ఫిర్యాదు చేస్తామని రోజా స్పష్టం చేశారు. 

గిడ్డి ఈశ్వరి..
స్వప్రయోజనాల కోసమే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని, ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పోతున్నామని వారు చెప్పడం అంతా బూటకమన్నారు.  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆప్రాంతాలనే అభివృద్ధి చేస్తామని అధికార టీడీపీ చెప్పడం దుర్మార్గమన్నారు. టీడీపీ మునిగి పోయే పడవని ఎధ్దేవా చేశారు. ఇప్పటికైనా పార్టీ మారిన వారంతా తమ పదవులకు రాజీనామా చేయాలని ఈశ్వరి డిమాండ్ చేశారు. 

కాకాని గోవర్థన్ రెడ్డి..
ఏపీలో చంద్రబాబు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడని ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి ఫైరయ్యారు . నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న రీతిలో రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని టీడీపీపై  ధ్వజమెత్తారు.   వైఎస్సార్సీపీ సింబల్ పై గెలిచిన ఎమ్మెల్యేలను లాక్కొంటూ బాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులను రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తీసుకెళ్తామన్నారు.  బాబు అరాచకాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నా, ఈసడించుకుంటున్నా ఇసుమంత కూడా లెక్కచేయడం లేదన్నారు. ఫిరాయింపులపై న్యాయస్థానాల్లో కూడా పోరాడుతామని వెల్లడించారు.  
Back to Top