ఒక్క ఇల్లు కట్టించలేని అసమర్థుడు చంద్రబాబు


 అనంతపురం:  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి నిరుపేదలకు 48 లక్షల పక్కా ఇల్లు నిర్మించార ని, ఒక్క ఇల్లు కట్టించలేని అసమర్థుడు చంద్రబాబు అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఉరవకొండలో పేదలకు వైయస్‌ రాజశేఖరరెడ్డి 89 ఎకరాలు కొనుగోలు చేశారన్నారు. మహానేత హయాంలో కేటాయించిన భూమిని పంపిణీ చేసేందుకు మండలి చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఉరవకొండలో పయ్యవుల బ్రదర్స్‌ కుటుంబ పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు కేటాయించకుండా కక్షసాధింపు మంచిది కాదని హితవు పలికారు. 
 
Back to Top