అనంత ఆర్‌డబ్ల్యూఎస్‌ ముట్టడి

అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అనంతపురం ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. నియోజకవర్గానికి సాగునీరు కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్యీ పయ్యావుల కేశవ్‌ నియోజకవర్గ రైతులకు నీరు రానివ్వకుండా కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేకి అని విమర్శించారు. సాగునీటిని అడ్డుకుంటున్న పయ్యావులకు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Back to Top