గ్రామస్థాయిలో పార్టీని బలోపేతాం చేద్దాం

చిత్తూరు: ఎన్నికల్లో విజయానికి బూత్‌ కమిటీల పాత్ర కీలకమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ అన్నారు. పూతలపట్టు నియోజకవర్గం యాదమ్రరిలో వైయస్‌ఆర్‌ సీపీ మండల కన్వీనర్‌ ధనుంజయరెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ సీపీ బూత్‌ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేయాలని కోరారు. 
Back to Top