బాబును చిత్తూరు ప్రజలు నమ్మడం లేదు

చిత్తూరు:  ముఖ్యమంత్రి జిల్లాకు చెందిన వ్యక్తి అయినా చంద్రబాబును  ప్రజలు విశ్వసించడం లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే సునిల్‌ అన్నారు. పుతలపట్టు నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తుందన్నారు. ఈ జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కుప్పంలో కూడా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఇంతవరకు ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇంత విజయవంతంగా సాగడానికి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే కారణమన్నారు. అన్ని వర్గాల ప్రజలు వైయస్‌ జగన్‌ వెంట అడుగులో అడుగులు వేస్తున్నారనిచెప్పారు. ఇవాళ జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్త్నునారని చెప్పారు. వైయస్‌ జగన్‌ సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు.  మా నియోజకవర్గంలో ఎక్కువ మంది పాడి పంటలపై ఆధారపడి జీవనం సాగుతున్నారని, ఇప్పటికే హెరిటేజ్‌ మోసం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. పాల రైతులను ఆదుకోవాలని వైయస్‌ జగన్‌ను కోరామన్నారు. ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకురావాలని కోరామని చెప్పారు.

 
Back to Top