ప్రజల ఆకాంక్ష నెరవేర్చడంలో చంద్రబాబు విఫలం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు
విశాఖపట్నం: ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హామీని ఎన్నికల ముందు బూచీగా చూపించి ఓట్లు దండుకున్న బీజేపీ, టీడీపీలు హోదా హామీని అమలు చేయకుండా రాష్ట్రాన్ని నట్టేట ముంచారని మండిపడ్డారు. విశాఖపట్నంలో నిర్వహించే వంచన వ్యతిరేక దీక్షలో పాల్గొని మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ నాలుగేళ్లుగా పోరాటం చేస్తుంటే.. అనేక సందర్భాల్లో చంద్రబాబు హేళన చేస్తూ మాట్లాడారన్నారు. కానీ ఇవాళ వైయస్‌ జగన్‌ దారిలోకే వచ్చాడన్నారు. యూటర్న్‌ తీసుకున్నా హోదా పోరాటం చిత్తశుద్ధితో చేయడం లేదని, ప్రజలను మరోసారి వంచేందుకు చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు, భవిష్యత్తుపై ప్రేమ ఉంటే వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు చేసినట్లుగా ఢిల్లీలో దీక్షలు, పోరాటాలు చేయాలన్నారు. గల్లీలో చెంచాగిరి రాజకీయాలు మానుకోవాలని సూచించారు. చంద్రబాబు ధర్మపోరాటం పేరుతో నయవంచన దీక్ష చేస్తున్నాడన్నారు. 
 
Back to Top