రైతుల‌ను ఒప్పించి భూసేక‌ర‌ణ చేప‌ట్టండి

వైయ‌స్ఆర్ జిల్లా: కడప-బెంగళూరు రైల్వే ప‌నుల్లో రైతుల‌కు న‌ష్టం వాటిల్ల‌కుండా చూడాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి   ఆర్డీవో దేవేంద్ర‌రెడ్డిని కోరారు. గురువారం రాయచోటి ప్రాంతం లో రైల్వే లైను భూసేకరణ పై రాయచోటి తహసీల్దార్ కార్యాలయం లో అధికారులు, బాధిత రైతులు తో ఆర్డిఓ దేవేంద్ర రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశం లో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా శ్రీ‌కాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. క‌డ‌ప‌- బెంగ‌ళూరు రైల్వే లైన్ ఈ ప్రాంత వాసుల చిర‌కాల వాంఛ అన్నారు.  రైతులను మెప్పించి, ఒప్పించి భూసేకరణ చేపట్టాల‌ని కోరారు.   రైల్వే లైను ప‌నుల్లో రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, నష్టాలు జరగకుండా చూడాలని కోరారు. భూమి కోల్పోయే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స‌కాలంలో  నష్టపరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. .
Back to Top